Night Curfew in Kerala: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కేరళలో నాలుగు రోజులపాటు రాత్రి కర్ఫ్యూ..

Kerala Night curfew: కేరళలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు కర్ఫ్యూను అమలు చేయనుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 01:07 PM IST
Night Curfew in Kerala: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కేరళలో నాలుగు రోజులపాటు రాత్రి కర్ఫ్యూ..

Night Curfew in Kerala: దేశంలో ఒమిక్రాన్ (omicron) శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి చేరింది కేరళ. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నేటి (డిసెంబరు 30) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ (Night curfew in Kerala) అమలు చేయాలని నిర్ణయించింది. 

రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు (restrictions) విధించనుంది. ఈ నిబంధనలు జనవరి 2 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తాజా ఆంక్షలు మతపరమైన ప్రదేశాలతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కేరళలో 65 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Kerala) ఉన్నాయి. 

Also Read: India Covid Cases: దేశంలో కొత్తగా 13,154‬ కరోనా కేసులు... 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఆంక్షలు వేటికి వర్తిస్తాయంటే...

1. డిసెంబర్ 30 నుండి జనవరి 2 వరకు ప్రజలు రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలి.
2. ఈ ఆంక్షలు ఉన్న నాలుగు రోజులు క్లబ్‌లు, బార్‌లు, హోటళ్లు మరియు రెస్టారెంట్‌లతో సహా అన్ని దుకాణాలు రాత్రి 10 గంటలలోపు మూసేయాలి.
3. ఈ ఆంక్షలు బీచ్ లకు కూడా వర్తిస్తాయి.
4. రాత్రి 10 గంటల తర్వాత థియేటర్లలో సినిమాలు ప్రదర్శించరాదు. 
5. ట్రావెల్ చేసేవారు ఎందుకు బయటకు వెళ్తున్నారో స్వీయ డిక్లరేషన్ ను తమ వద్ద ఉంచుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News