మోదీ పర్యటనలకు దారిచూపినందుకు రూ.2 లక్షలు వసూలు చేసిన పాక్..!

ప్రధాన మంత్రి మోదీ ప్రయాణించే విమానాలకు దారి చూపినందుకు పాకిస్తాన్ 2.86 లక్షల రూపాయలను వసూలు చేసింది.

Last Updated : Feb 19, 2018, 12:42 PM IST
మోదీ పర్యటనలకు దారిచూపినందుకు రూ.2 లక్షలు వసూలు చేసిన పాక్..!

ప్రధాన మంత్రి మోదీ ప్రయాణించే విమానాలకు దారిచూపినందుకు పాకిస్తాన్ 2.86 లక్షల రూపాయలను వసూలు చేసింది. వైమానిక దళాలకు చెందిన విమానాల్లో మోదీ పర్యటనలకు అయిన ఖర్చుల వివరాలను రిటైర్ నేవీ అధికారి లోకేష్ బత్రా సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా, ఈ వివరాలు అందాయి. మోదీ 2016 జూన్ వరకూ 11 దేశాల్లో పర్యటించేందుకు వైమానిక విమానాల్లో ప్రయాణించారు.

రష్యా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి తిరిగివస్తూ లాహోర్ లో ఆగినప్పుడు పాక్ మార్గనిర్దేశన రుసుము కింద 1.49 లక్షల రూపాయలను వసూలు చేసింది. మోదీ తమ దేశం మీదుగా వైమానిక విమానంలో ఇరాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు రూ.77,215, ఖతర్ పర్యటనకు వెళ్ళినప్పుడు రూ.59, 215ను పాక్ వసూలు చేసింది. మొత్తంగా వాయుసేన విమానంలో మోదీ పర్యటనల ఖర్చు రూ. 2కోట్లు అని తెలిపింది.

Trending News