Yasin Malik: పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో తీర్పును వెలువరించింది. ఈకేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈకేసులో దోషిగా తేల్చి కోర్టు..యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇటీవల తన నేరాన్ని యాసిన్ మాలిక్ అంగీకరించారు. దీంతో పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో మరణ శిక్ష విధించాలని ఎన్‌ఐఏ వాదించింది. ఐతే పాటియాలా కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. అంతకముందు ఎన్‌ఐఏ కోర్టులో వాదనల సందర్భంగా యాసిన్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 28 ఏళ్లలో ఉగ్ర వాద కార్యకలాపాల్లో తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..ఏ శిక్షకైనా సిద్ధమని కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది.
ఎన్‌ఐఏ మాత్రం ఇందుకు భిన్నంగా వాదించింది. ఉగ్ర వాద కార్యకలాపాలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలని వాదనలు వినిపించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ..కాశ్మీర్ వేర్పాటువాద నేతకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చింది. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనగర్‌లో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాసిన్ మాలిక్ నివాసం సమీపంలో నిఘాను పెంచారు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీని పర్యవేక్షించారు. ఐతే కోర్టు తీర్పుపై యాసిన్ మాలిక్ మద్దతుదారులు,అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో నినాదాలు చేశారు. కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో అతడిపై 2017లో కేసు నమోదు అయ్యింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద, చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు చేకూర్చినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో యాసిన్ మాలిక్‌పై ఛార్జీషీట్ దాఖలైంది. మాలిక్‌తోపాటు పలువురిపై అభియోగాలు నమోదు చేశారు అధికారులు.
Also read:konaseema protest: శాంతించని కోనసీమ.. మళ్లీ ఆందోళనలు మొదలు..!
Also read:Viral Photo: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! పెళ్లి బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి