Pension for Labour: ప్రధానమంత్రి శ్రమ యోగి మంథన్ యోజన చెమటోడ్చి పనిచేసే కార్మికులకు..అసంఘటిత రంగానికి పెన్షన్ ఇచ్చే పథకం. ఆ పెన్షన్ గురించిన వివరాలతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి
ఇకపై కూలీలకు కూడా వృద్ధాప్య పెన్షన్ అందుతుంది. అదే ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన పథకం. ఇది అసంఘటిత రంగ కార్మికులకు మెరుగైన ఫథకం. ఈ పధకంలో భాగంగా చెమటోడ్చి పనిచేసేవారు, రిక్షా కార్మికులు, నిర్మాణరంగంలో పనిచేసే కూలీలు, వివిధ పనుల్లో ఉండే అసంఘటితరంగ కార్మికులకు వృద్యాప్యంలో సురక్షితంగా ఉండేందుకు సహాయం లభిస్తుంది. ప్రభుత్వం ఈ పథకం కింద పెన్షన్ గ్యారంటీ ఇస్తోంది. ఈ పధకంలో మీరు రోజుకు కేవలం రెండు రూపాయలు పొదుపు చేస్తూ..ఏడాదికి 36 వేల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకం ప్రారంభించాలంటే మీరు ప్రతి నెలా 55 రూపాయలు సేవ్ చేయాల్సి ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయస్సున్న రోజువారీ కూలీ 2 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఏడాదికి 36 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి 40 ఏళ్ల వయస్సు నుంచి ఈ పథకం ప్రారంభిస్తే..నెలకు ఆ వ్యక్తి 2 వందల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తరువాత మీకు పెన్షన్ రావడం ప్రారంభమౌతుంది. 60 ఏళ్ల తరువాత నెలకు 3 వేల రూపాయలు అంటే ఏడాదికి 36 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకంలో చేరేందుకు మీకు సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్, ఆధార్ కార్డు ఉంటే చాలు. వ్యక్తి వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. దీనికోసం కామన్ సర్వీస్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. సీఎస్‌సి పోర్టల్‌లో సంబంధిత కూలీ తన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పధకం కోసం వెబ్‌పోర్టల్ సిద్ధం చేసింది.
మీ ఆధార్ కార్డు, సేవింగ్ లేదా జనధన్ బ్యాంకు ఎక్కౌంట్ పాస్‌బుక్, మొబైల్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవికాకుండా సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు ఆ వ్యక్తి నెలకు నిర్ణీత రుసుము కట్ అయ్యేందుకు వీలుగా అనుమతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధన్ యోజనలో భాగంగా ఎవరైనా అసంఘటిత రంగ కార్మికులు 40 ఏళ్ల వయస్సులోపల ఉన్నవాళ్లు చేరవచ్చు. ఈ పధకం ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకంలో చేరేవ్యక్తి నెలసరి ఆదాయం 15 వేలకంటే తక్కువే ఉండాలి. ప్రభుత్వం ఈ ఫదకం కోసం కార్మిక శాఖ, ఎల్ఐసీ, ఈపీఎఫ్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లి ఈ పథకం సమాచారం పొందవచ్చు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18002676888 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Also read: Fighter Jets: భారత అమ్ములపొదిలో త్వరలో 114 ఆధునిక యుద్ధ విమానాలు, శత్రు దేశాలకు కలవరమే
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి