Baba Siddique Arrest: బాబా సిద్దిఖీ హత్య.. మెయిన్ షూటర్ అరెస్ట్..

Baba Siddique Arrest: మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు ఘటనలో నిందితుల్లో ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా… యూపీలోని బహ్రెచ్‌లో అరెస్టు చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 11, 2024, 10:11 AM IST
Baba Siddique Arrest: బాబా సిద్దిఖీ హత్య.. మెయిన్ షూటర్ అరెస్ట్..

Baba Siddique Arrest: ఎన్సీపీ నేత.. సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాబా సిద్దిఖీ హత్య జరిగిన నెల రోజులు కావొస్తోంది. అప్పటి నుంచి మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని గాలించే పనిలో పడ్డారు. ఎట్టకేలకు పరారీలో ఉన్న నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతనికి ఆశ్రయం కల్పించి నేపాల్ కు పారిపోయేందుకు సహకరించినందుకు గానూ ముంబై క్రైమ్ మరో నలుగురిని అరెస్ట్ చేసింది. అందులో జ్ఞాన్ ప్రకాష్ త్రిపాఠి, ఆకాష్ శ్రీవాస్తవ,  అనురాగ్ కశ్యప్, అఖిలేశేంద్ర ప్రతాప్ సింగ్‌లు‌గా పోలీసులు గుర్తించారు.

Add Zee News as a Preferred Source

శివకుమార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో వీరు పనిచేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. కెనడాలోని అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకు తాను పనిచేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.
వి
చారణ బృందంలో మొత్తం ఆరుగురు ఆఫీసర్లతో పాటు  15 మంది సభ్యులు ఉన్నారు. శివకుమార్‌తో పాటు నిందితులను పోలీసులు ముంబైకి తరలించనున్నారు. లక్నోలోని శివకుమార్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోలీసులు గత నెల వెళ్లారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించారు. శివకుమార్ ఎలాంటి ఆధారాలు దొరకుండా ఆమెకు ఫోన్ చేయడం ఆపేశాడు. పాత సిమ్‌ను సైతం ధ్వంసం చేశాడు. అయితే ఈ కేసులో ఆమె ప్రమేయం లేదని పోలీసులు నిగ్గు తేల్చారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News