బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి పెళ్లికి సంబంధించిన ఓ పోస్టర్ ఒకటి వివాదాస్పదమైంది. వరుడికి ఈశ్వరుడి గెటప్, వధువుకి పార్వతి గెటప్ వేసి ఎవరో అభిమానులు వరుడి ఇంటి ముందు పెట్టిన హోర్డింగ్ పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ పెళ్లి శనివారం జరగనుంది. ప్రస్తుతం పెరోల్ మీద జైలు నుండి వచ్చిన లాలూ ఈ పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ఇవాళ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ వివాహం జరగనున్న నేపథ్యంలో పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సహా దాదాపు 10 వేల మంది లాలూ కుమారుడి పెళ్లికి హాజరు కానున్నారు.ఈ పెళ్లి వేడుకకు 50 గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అయితే ఈ పెళ్లి వేడుకల్లోనే ఓ విషాదం కూడా చోటు చేసుకుంది. ఆ వేడుకలకు వెళ్లి వస్తున్న ఆర్జేడీ నాయకుడు దీనా గోపేను ఈ రోజు ఉదయం కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బీహార్ రాజధాని పాట్నాకి ఒకప్పుడు డిప్యూటీ మేయరుగా పనిచేసిన అమరావతి దేవి భర్తే ఆయన.
Patna: Poster seen outside the residence of Lalu Prasad Yadav, depicting groom Tej Pratap Yadav as Lord Shiva & bride Aishwarya as Goddess Parvati. #Bihar pic.twitter.com/nzldmcfaRI
— ANI (@ANI) May 12, 2018