రాహుల్ నియోజకవర్గంలో ప్రియాంక  భావోద్వేగం 

రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ప్రియాంక ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు

Updated: Apr 20, 2019, 05:36 PM IST
రాహుల్ నియోజకవర్గంలో ప్రియాంక  భావోద్వేగం 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ఇవాళ్ల ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు రాహుల్ గురించి మాట్లాడుతూ "నేను ఒక చెల్లెలుగా మీ ముందుకు వచ్చాను... ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నా సోదరుడు ప్రజల కోసం నిలబడ్డారు" అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీ వారు  తన తండ్రిని ఓ దొంగ అని నిందించారు... తన సోదరుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విద్యార్హతల తప్పుడు ఆరోపణలు చేస్తూ బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో దశాబ్దకాలంగా రాహుల్ గాంధీ పై రకరకాలుగా దాడులు చేస్తున్నారని...అయినా అన్నింటిని తట్టుకుని ఎదిరించి నిలిచారు..రాహుల్ గాంధీ దేశానికి సరైన నాయుకుడు అంటూ రాహుల్ ను ప్రియాంక కీర్తించారు