Pulwama Attack: అమరవీరుల త్యాగానికి నాలుగేళ్లు.. భారత్ రివేంజ్ తీర్చుకుంది ఇలా..

Pulwama Attack 4th Anniversary: పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అమర వీరుల సేవలను గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆ మారణహోమ దృశ్యాలు ప్రజల కళ్ల ముందు ఇంకా అలా కదులుతూనే ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 11:05 AM IST
  • పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు
  • 40 మంది సైనికులు వీర మరణం
  • దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులు
Pulwama Attack: అమరవీరుల త్యాగానికి నాలుగేళ్లు.. భారత్ రివేంజ్ తీర్చుకుంది ఇలా..

Pulwama Attack 4th Anniversary: సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతోంది. ఈ కాన్వాయ్‌ పుల్వామా వద్దకు చేరుకోగానే.. అవతలి వైపు నుంచి ఓ కారు వచ్చి ఢీకొట్టింది. ఉగ్రమూకలు ఢీకొట్టిన కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున సంభవించి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. నాలుగేళ్ల క్రితం ఈరోజు ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి మనదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. పాకిస్థాన్‌లో స్థావరం ఏర్పాటు చేసుకుని.. కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీకి చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.

అయితే ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిది. మన వీర సైనికులు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరగ్గా.. మరో 12 రోజుల్లోనే ఫిబ్రవరి 26న భారత్ రీవెంజ్ తీర్చుకుంది. భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించింది. వైమానిక దాడులు నిర్వహించి.. ఉగ్రమూకలను మన సైనికులు మట్టుబెట్టారు. ప్రతిస్పందనగా పాక్ కూడా భారత్‌పై దాడి చేసేందుకు యత్నించింది. వైమానిక దాడులకు యత్నించగా.. భారత్ బలగాలు తిప్పికొట్టాయి. 

ఈ క్రమంలో భారత మిగ్-21 పాకిస్థాన్ సైన్యం దాడికి గురై ఆ దేశం‌లో పడింది. మిగ్-21 పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ సైనికులు పట్టుకున్నారు. మార్చి 1న అమెరికా, ఇతర దేశాల ఒత్తిడితో అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్ విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. అంతేకాకుండా పాకిస్థాన్ నుంచి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కూడా భారత్ ఉపసంహరించుకుంది. దీంతో ఆర్థికంగా పాకిస్థాన్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆన్ మనీ లాండరింగ్ (ఎఫ్‌ఎటిఎఫ్)ని కూడా డిమాండ్ చేసింది.

ఆ రోజు కాలిపోయిన సైనికుల మృతదేహాలు.. మారణహోమం దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. పుల్వామా ఘటనను ఖండిస్తూ అమరవీరులకు నివాళులర్పిస్తూ నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. అమరజవానుల సేవలను కొనియాడుతూ.. సంతాపం తెలుపుతున్నారు. 

Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!  

Also Read: Kodali Nani: జగన్ వినాశనానికి వైఎస్ వివేకా కుటుంబం ప్రయత్నించింది.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News