మాజీ సీఎంపై బూటు విసిరిన వ్యక్తికి.. రెండేళ్ళ జైలుశిక్ష

మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై జనవరి 2017 నెలలో ఆగ్రహంతో బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ కేసులో తుదితీర్పును పంజాబ్‌లోని మాలౌత్ కోర్టు వెల్లడించింది.

Last Updated : Oct 11, 2018, 06:14 PM IST
మాజీ సీఎంపై బూటు విసిరిన వ్యక్తికి.. రెండేళ్ళ జైలుశిక్ష

మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై జనవరి 2017 నెలలో ఆగ్రహంతో బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ కేసులో తుదితీర్పును పంజాబ్‌లోని మాలౌత్ కోర్టు వెల్లడించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాదల్ లంబీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా.. సర్బల్ ఖల్సా గ్రూపుకి చెందిన జేటేదార్ ఉద్యమకారుడైన వ్యక్తి ప్రకాష్ సింగ్ పై బూట్లను విసిరాడు.

ఆ ఘటన జరిగాక.. అదే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీల ద్వారా ఘటనకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి తర్వాత అరెస్టు చేశారు. ఆయనను జటేదార్ ఉద్యమకారుడు అమ్రిక్ సింగ్ అజ్నాలా సోదరుడిగా గుర్తించారు. తర్వాత ఆ వ్యక్తిని విచారించి పోలీసులు.. సంఘటనకు గల కారణాలను కూడా వెల్లడించారు. పంజాబ్‌లో సిక్కుల మత గ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్‌ను పలువురు అవమానించిన ఘటన జరిగాక.. ఆ అంశంపై స్పందించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను బూటు విసిరానని సదరు వ్యక్తి తెలిపాడు.

ఆ ఘటన తర్వాత నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆయనపై పలు సెక్షన్లకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. ఆ కేసులను తాజాగా విచారించిన కోర్టు.. పబ్లిక్‌లో అల్లర్లు చెలరేగే విధంగా ప్రవర్తించినందుకు సదరు వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. 

Trending News