PM Modi: ముందుగా Covid-19 Vaccine ఇవ్వండి, తరువాత ఉపన్యాసాలు: Rahul Gandhi

Rahul Gandhi takes dig at PM Narendra Modi: ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ రేటుకు సంబంధించి వాస్తవాలు ఏమైనా చెప్పాలంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 27, 2021, 04:12 PM IST
PM Modi: ముందుగా Covid-19 Vaccine ఇవ్వండి, తరువాత ఉపన్యాసాలు: Rahul Gandhi

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ పక్కనపెట్టి కోవిడ్19 వ్యాక్సిన్లు అందజేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మన్ కీ బాత్ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్ అవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ రేటుపై పలు కీలక విషయాలు తెలిపేలా ఓ వీడియోను సైతం ఆయన షేర్ చేశారు.

ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ రేటుకు సంబంధించి వాస్తవాలు ఏమైనా చెప్పాలంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. తద్వారా దేశ పౌరులకు కోవిడ్19 (Covid Vaccination) టీకాలపై వాస్తవాలు తెలుస్తాయని, 78వ మన్ కీ బాత్‌ ద్వారా అది సాధ్యం చేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ ఒకరోజు పెరిగితే మరుసటి తగ్గుతూ ఉన్నట్లుగా కనిపించే గ్రాఫిక్స్ వీడియోను సైతం ట్వీట్‌లో షేర్ చేయడం గమనార్హం. దేశ ప్రజలకు కావాల్సిన మోతాదులో కరోనా వ్యాక్సిన్ అందించిన తరువాత మీరు మన్ కీ బాత్‌లో మీకు కావాల్సింది చెప్పవచ్చునని పేర్కొన్నారు.

Also Read: Mann Ki Baat: నేను, నా తల్లి కరోనా టీకాలు తీసుకున్నామంటూ PM Modi పలు కీలక విషయాలు

దేశ ప్రజలు ధైర్యంగా కరోనా వైరస్‌తో పోరాడుతున్నారని, కానీ మన పోరాటం ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేటి మన్ కీ బాత్‌లో గుర్తుచేశారు. గత ఏడాది వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోననే సవాల్ మన ముందు ఉండేదని, ప్రస్తుతం రోజు వ్యవధిలో లక్షల మందికి కోవిడ్19 వ్యాక్సిన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. తాను, తల్లి సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కనుక దేశ ప్రజలు సైతం భయాలు వీడి వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా టీకాలపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, శాస్త్రవేత్తలను నమ్మాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Also Read: Delta Plus Variant Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, డెల్టా కేసులతో బీ కేర్‌ఫుల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News