Rajasthan road accident : రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, ఆయిల్ ట్యాంకర్ (Road accident) ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బర్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం(నవంబర్ 10) ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ ప్రయాణికుడు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ బస్సు బలోత్రా నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరింది. బస్సు బర్మర్ జిల్లాలోని పచ్‌పద్ర మీదుగా వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో బస్సులో మంటలు వ్యాపించడంతో (Bus caught fire) భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకూ 12 మంది చనిపోయినట్లు గుర్తించగా మరో 10 మందిని రక్షించగలిగారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో మొత్తం 25 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Woman Kills Husband : ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి సుఖ్‌రాం బిష్నోయ్, స్థానిక ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok gehlot) అధికారులను ఆదేశించారు. హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో (Road accident) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా... పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook