రాజస్థాన్ లో భారీగా బంగారు నిక్షేపాలు

రాజస్థాన్ లో భారీగా బంగారు నిక్షేపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Last Updated : Feb 11, 2018, 04:12 PM IST
రాజస్థాన్ లో భారీగా బంగారు నిక్షేపాలు

రాజస్థాన్ లో భారీగా బంగారు నిక్షేపాలున్నాయని భూభౌతిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉపరితలానికి కేవలం 300 అడుగుల లోతులోనే ఇవి ఉన్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్ ఎన్.కుటుంబరావు తెలిపారు. అధికభాగం బన్ స్వారా, ఉదయ్ పుర్ నగరాల్లో కేంద్రీకృతమైనట్లు చెప్పారు.

మొత్తం 11.84 కోట్ల టన్నుల మేరకు బంగారం నిల్వలు ఈ గనుల్లో ఉండి ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న గనులను పరిశీలిస్తున్నామని, సికర్ జిల్లాలోని  నీమ్ కా థాన్ ప్రాంతాల్లో రాగి, బంగారం వెలికితీత పనులు జరుగుతున్నాయని అన్నారు. రాజ్ పురా-దరీబా గనుల్లో 35 కోట్ల టన్నుల జింక్, సీసం ఉన్నట్టు కనుగొన్నామని, 8 కోట్ల టన్నుల రాగి నిల్వలను సైతం గుర్తించామని తెలిపారు. జైపూర్ లో సీసం, జింక్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.

Trending News