మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కు సంబంధించి మార్ఫింగ్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మార్ఫింగ్ వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన చేసింది. ఆర్ఎస్ఎస్ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని రాజకీయ శక్తులు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాయని మండిపడింది. తాము ఈ ఘటనను తీవ్రంగ ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది.
నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షాణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా వారిలాగే తన కుడి చేతిని ఎత్తి ఛాతి వరకు ఉంచినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్ ఈ మేరకు స్పందించింది.
ప్రణబ్ ఫొటో మార్ఫింగ్ పై ఆర్ఎస్ఎస్ రియాక్షన్