COVID-19 vaccine: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (Oxford Vaccine) తో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII).. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DGCI)ను కోరింది. అయితే సీరం ఇనిస్టిట్యూట్ శుక్రవారమే డీసీజీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Jul 26, 2020, 12:24 PM IST
COVID-19 vaccine: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

Oxford COVID-19 vaccine: ఢిల్లీ: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ( Oxford Vaccine ) తో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII).. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ( DGCI )ను కోరింది. అయితే సీరం ఇనిస్టిట్యూట్ శుక్రవారమే డీసీజీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతులైన 18 ఏళ్లకు పైబడిన వారిలో పరీక్షలు జరుపుతామని దరఖాస్తులో వెల్లడించింది. దాదాపు 1600 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని, ఇది ఎంత వరకు సురక్షితం, రోగనిరోధక వ్యవస్థ తీరు గురించి అధ్యయనం చేయాల్సి ఉందని ఆ దరఖాస్తులో వెల్లడించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే

ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ విజయవంతమైనట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా బాధ్యతను ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50 శాతం భారత్‌కే కేటాయిస్తామని కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా సైతం ప్రకటించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ధర వేయిలోపే ఉంటుందని కూడా కంపెనీ ప్రకటించింది. Also read: Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం

Trending News