Success Story: ఇంటర్ ఫెయిల్.. సీన్ కట్ చేస్తే హైదరాబాద్‌లోనే అత్యంత ధనవంతుడు..ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Success Story: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు మురళీకృష్ణ ప్రసాద్ దివి నేడు నగరంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్నారు. అయితే అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడావల్సి వచ్చింది. ఇంటర్ లో ఫెయిల్ అయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Dec 13, 2024, 04:30 PM IST
Success Story: ఇంటర్ ఫెయిల్.. సీన్ కట్ చేస్తే  హైదరాబాద్‌లోనే అత్యంత ధనవంతుడు..ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Success Story: ఒక్కప్పుడు రూ. 250 జీతానికి పనిచేసాడు.కష్టపడి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. జీవితంలో పట్టుదలతో పనిచేస్తే గొప్ప విజయం సాధించవచ్చు అని చెప్పడానికి ఆయనే నిదర్శనం. ప్రపంచంలో అపజయానికి భయపడని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ వ్యక్తులు తమ వైఫల్యాన్ని ముందుకు సాగించేందుకు సాధనంగా చేసుకుంటారు. మురళీ దివి కూడా అలాంటి వ్యక్తే. మందుల తయారీ కంపెనీ దివీస్ ల్యాంగ్ గురించి మీరు వినే ఉంటారు. మురళీ దివి ఔషధాల తయారు చేస్తున్న దివీస్ ల్యాబ్ అనే సంస్థను స్థాపించాడు. అలాగని మురళికి ఈ విజయం అంత ఈజీగా వచ్చిందికాదు. చాలా సార్లు అపజయాన్ని ఎదుర్కొవల్సి వచ్చింది. అయినా  పట్టు వదల్లేదు. నేడు లక్ష కోట్ల విలువైన కంపెనీకి యజమానిగా మారారు. 

ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ ఫార్మా రంగంలో మంచి పేరుగాంచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.3 లక్షలకోట్లు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మురళీ దివి సక్సెస్ స్టోరీ కూడా అంతే స్ఫూర్తిదాయకం. మురళీ దివి ఎంత పోరాటం చేస్తే అంతటి విజయం సాధించాడు. రూ. 10వేలతో 14 మంది ఉన్న కుటుంబాన్ని నడపడం అంత సులభం కాదు. ఆయన బాల్యం అంతాకూడా ఏపీలోని ఓ కూగ్రామంలో గడిచింది. తండ్రి సాధారణ ఉద్యోగి. జీతం ఎలాగోలా బతకడానికి సరిపోయేది. ఒక్కప్పుడు ఒక్క పూట భోజనం చేసి నిద్రపోయిన మురళి నేడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. 

Also Read:  Home Loan: సీనియర్ సిటిజన్లు హోంలోన్ తీసుకోవచ్చా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే  

బీ ఫార్మసీ చేసి 25ఏళ్లవయసులో కేవలం రూ. 500 జేబులో పెట్టుకుని మురళి అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేశాడు. మొదటి ఉద్యోగం జీతం రూ. 250 వచ్చింది. మురళి కథను వింటుంటూ సినిమాలా అనిపిస్తుంది. పలు ఫార్మా కంపెనీల్లో పనిచేసి సుమారు రూ. 54 లక్షలు కూడబెట్టారు. అక్కడ ఆయన ఫార్మా రంగాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేసిన అనంతరం భారత్ కు తిరిగి వచ్చారు. మురళి తను సంపాదించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ పెట్టి 1984లో ఫార్మా రంగంలోకి అడుగుపెట్టారు.

2000లో డాక్టర్ రెడ్డీస్ లో పనిచేవారు. కల్లం అంజిరెడ్డితో కలిసి చేతులు కలిపారు. మురళి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లో 6ఏళ్లు పనిచేశాడు. దీని తర్వాత అతను 1990లో దివీస్ లేబొరేటరీస్ ను ప్రారంభించాడు. 1995లో తెలంగాణలోని చౌటుప్పల్ లో మురళీ దివి తన మొదటి తయారీ యూనిట్ స్థాపించారు. మార్చి 2022లో కంపెనీ రూ. 88 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇప్పుడు కంపెనీ విలువ రూ. 1.3లక్షల కోట్లు. 

Also Read: Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News