IRCTC Special Tourist Package: ఈ సమ్మర్ లో తెలుగు రాష్ట్రాల ప్రజలు విహారయాత్ర కి కేరళ వెళ్లాలనుకుంటే భారత రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడిచే ఐ ఆర్ సి టి సి అద్భుతమైన ఆఫర్ ని కొత్త ప్యాకేజీ రూపంలో తీసుకొచ్చింది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే కేరళ వెళ్లాల్సిందే.. అలాంటి కేరళ కి తెలుగు రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించి ప్రత్యేక రైలు నడిపేందుకు భారత రైల్వే సిద్ధం అయ్యింది. కేరళలోని వివిధ ప్రాంతాలను చుట్టి రావడానికి ఐదు రోజుల పాటు ఈ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది.
రైలు చార్జీతోనే స్థానికంగా తిరగడానికి కూడా వాహనాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ మినహా మొత్తం ప్రయాణ ఖర్చులు అల్పాహార ఖర్చులు రైల్వే శాఖ చూసుకుంటుంది. మే 9వ తారీఖు నుండి ప్రతి మంగళవారం ఈ ప్రత్యేక రైలు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడు ఉండే శబరి ఎక్స్ప్రెస్ ని ఈ ప్రత్యేక ప్యాకేజీ కోసం వినియోగిస్తున్నారు. మంగళవారం రోజు మాత్రం ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఈ రైలు నడపబోతున్నట్లుగా ఇండియన్ రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రత్యేక రైలు దాదాపు 25 గంటల తర్వాత కేరళలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. అక్కడ ఐఆర్సిటిసి సిబ్బంది మున్నార్ కి ప్రత్యేక వాహనాల్లో చేర్చుతారు. ఆరోజు రాత్రి అక్కడ సేద తీరి ఉదయం అల్పాహారం తీసుకొని ఎర్నాకులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం మట్టు పెట్టి డ్యామ్ ని చూసేందుకు తీసుకెళ్తారు. అలా ఐదు రోజుల పాటు మొత్తం ట్రిప్ పక్కాగా ప్లాన్ చేసి ఐఆర్సిటిసి ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.
Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
సింగిల్ షేరింగ్ కావాలంటే ఒక్కొక్కరికి 32,230 రూపాయలు, ట్విన్ షేరింగ్ అయితే రూ.18,740, ట్రిపుల్ అయితే 15,130 రూపాయలను వసూలు చేస్తుంది. ఇక ఐదు నుండి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి బ్రెడ్ తో అయితే 8,730 రూపాయలు బెడ్ లేకుండా అయితే 6,530 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం కేరళ కి ఈ సమ్మర్ హాలిడేస్ లో వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ఆలోచన ఉంటే ఈ ప్యాకేజీని ఒకసారి ట్రై చేయండి.
Also Read: Akhil Pooja Hegde Date : పూజా హెగ్డేతో డేటింగ్.. ఓపెన్ అయిన అఖిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.