న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులలో ఒకడైన పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. నిర్భయపై అత్యాచారం చేసిన సమయంలో తాను మైనర్ అని, తీర్పు సమయంలో ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) సోమవారం (జనవరి 20న) విచారణ జరిపారు. చివరికి గతంలో ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు జస్టిస్ భానుమతితో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ స్పష్టం చేసింది. గతంలో ఇదే విషయంపై దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేయగా... తాజా వివరాలంటూ మరోసారి పిటిషన్ దాఖలు చేయడంలో ఆంతర్యమేమిటని పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
Also Read: ‘నిర్భయ’ కేసులో సరికొత్త ట్విస్ట్.. దోషులకు ఉరిశిక్ష వాయిదా
స్కూలు రికార్డ్ ప్రకారం తన క్లైయింట్ పవన్ పుట్టినతేదీ అక్టోబర్ 8, 1996 అని నిర్భయపై దారుణం జరిగేనాటికి (డిసెంబర్ 16, 2012) అతడు మైనర్ అని అతడి లాయర్ ఏపీ సింగ్ సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. నేరం చేసిన సమయంలో అతడు మైనర్ కనుక జువైనల్గా పరిగణించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టులో విచారణ సమయంలో ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోలేదని, అందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. గతంలో సమర్పించిన డాక్యుమెంట్లనే మళ్లీ కోర్టుకు సమర్పించి కొత్త సమాచారమని ఎందుకు తప్పుదోవ పట్టించాలని చూశారంటూ ఏపీ సింగ్ను భానుమతితో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. చివరికి పవన్ గుప్తా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది.
Also Read: నీకెంత ధైర్యం.. రేప్ చేసి చంపినవాళ్లను విడిచిపెట్టాలా?
తీర్పు అనంతరం నిర్భయ తల్లి ఆశా దేవి మీడియాతో మాట్లాడారు. ఉరిశిక్షను వాయిదా వేసేలా చేయడమే దోషుల పని అన్నారు. కానీ ఫిబ్రవరి 1న నలుగురికి ఉరిశిక్ష అమలవుతేనే తమకు ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ ఉరిశిక్షను వాయిదా వేయించాలని యత్నిస్తున్నారని అయితే ఒకరి తర్వాత ఒకరికి ఉరి అమలవుతుంటే.. చట్టంతో ఆడుకుంటే ఏం గతి పడుతుందో తెలుస్తుందన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..