Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను బంగారం (Gold Rate Today), వెండి నమోదు చేస్తున్నాయి. బంగారం ధర ఢిల్లీలో 50 వేల మార్క్ చేరగా, వెండి కేజీ ధర ఏకంగా రూ.60వేల ధర నమోదు చేసింది.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jul 24, 2020, 07:06 AM IST
Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారంధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి మాత్రం ఊహించనంతగా పెరిగి, ఆల్‌టైమ్ గరిష్ట ధరకు చేరుకుంది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,500 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,150 వద్ద ట్రేడ్ అవుతోంది. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి మార్కెట్‌లో రూ.250 పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,200 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000కి చేరింది.  Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

నేడు వెండి ధర రూ.3,050 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధర నమోదు చేసింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.62,000కి చేరింది. బులియన్ మార్కెట్‌‌లో ఇప్పటివరకూ ఇదే ధర అత్యధికం. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్