Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

రెండు రోజులు వరుసగా పెరిగిన తర్వాత బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. అయితే పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.

Last Updated : Sep 17, 2020, 07:11 AM IST
  • రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం, వెండి ధరలు
  • తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధరలు
  • దేశ వ్యాప్తంగా 1 కేజీ వెండి ధర రూ.69,000కి క్షీణించింది
Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.70 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,950 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,450కి పడిపోయింది. Telangana: అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర (Gold Rate in Delhi) మళ్లీ స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.50 మేర స్వల్పంగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,400కి దిగొచ్చింది. Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రెండు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.500 మేర ధర తగ్గడంతో.. 1 కేజీ వెండి ధర రూ.69,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది. Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి 

 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News