Gold Price In India: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మార్చి 17న పెరిగాయి.

Last Updated : Mar 17, 2020, 07:53 AM IST
Gold Price In India: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మార్చి 17న పెరిగాయి. జ్యువెలర్ల విక్రయాలు పెరగడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో పసిడి ధరలు నేటి మార్కెట్‌లో పెరిగిపోయాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. ధరలు పెరగడంతో నేడు బంగారు, వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయి.

EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..  

హైదరాబాద్ మార్కెట్‌లో మార్చి 17న (మంగళవారం) బంగారం 10 గ్రాముల ధర రూ.290 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.43,320కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర సైతం పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 270 మేర పెరగడంతో 10గ్రాముల ధర రూ.39,620కి పెరిగింది. 

Also Read: నేటి నుంచి ఆ కార్డులపై సర్వీసులు రద్దు

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,650కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరిగింది. దీంతో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.40,450 అయింది.

బంగారం దారిలోనే వెండి

కాగా, వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. 1 కేజీ వెండి ధర రూ.250 మేర పెరిగింది. దీంతో వెండి ధర 1 కేజీ రూ.48,060కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ వెండి ధర రూ.48,060 వద్ద ట్రేడ్ అవుతోంది. నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్, స్థానిక మార్కెట్లలో భారీ కొనుగోళ్లతో వెండి ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం గమనార్హం. 
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

ఏపీలోనూ భగ్గుమన్న ధరలు (24 Carat Gold Rate in Vijayawada and Visakhapatnam)

ఏపీలోనూ బంగారం ధరలు పెరిగాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.43,320కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 270 మేర పెరగడంతో 10గ్రాముల ధర రూ.39,620 అయింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News