/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

కేరళలోని మల్లప్పురం ప్రాంతంలో ఓ ఫోటో జర్నలిస్టు పై ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే నిన్న సాయంత్రం నడిరోడ్డుపై ధర్నాకి దిగిన దాదాపు 100 మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వాహనాలను అటకాయించారు. ఇటీవలే కేరళలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసనను చేపట్టారు.

అయితే అలా నిరసన చేస్తున్నప్పుడు ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఓ వాహన చోదకుడిని కొట్టారు. ఆ ఘటనను ఓ జర్నలిస్టు వీడియో తీశారు. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇద్దరు యువకులు మల్లప్పురం ప్రెస్ క్లబ్బుకి వచ్చి మరీ జర్నలిస్టు మీద చేయి చేసుకున్నారు. ఆయనను తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు కూడా చేశాయి.

ఈ కేసులో ప్రస్తుతం జర్నలిస్టుపై దాడికి పాల్పడిన ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పర్మిషన్ లేకుండా రోడ్డు బ్లాక్ చేసి వాహన చోదకులను ఇబ్బందులకు గురిచేసినందుకు మరో 10 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Section: 
English Title: 
Two RSS workers arrested for attack on photojournalist in Kerala
News Source: 
Home Title: 

జర్నలిస్టుపై ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దాడి

జర్నలిస్టుపై ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దాడి
Caption: 
Image Credit: PTI
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జర్నలిస్టుపై ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దాడి