Jamili Elections: జమిలీపై కేంద్రం స్పష్టత, ఆ ఆలోచన లేదు కానీ అప్పుడే వెల్లడించలేం, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Jamili Elections: దేశంలో ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా జమిలి ఎన్నికలే విన్పిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అసలేం జరుగుతోంది, కేంద్రం ఏమంటోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 3, 2023, 01:48 PM IST
Jamili Elections: జమిలీపై కేంద్రం స్పష్టత, ఆ ఆలోచన లేదు కానీ అప్పుడే వెల్లడించలేం, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Jamili Elections: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు సెప్టెంబర్ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జమిలీ ఎన్నికల చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు తీవ్రతరం చేశాయి. ఇప్పుడీ విషయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టత ఇచ్చారు. 

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన మరో ఏడుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అదీర్ రంజన్ చౌదరి, మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి,  సుభాష్ కే కశ్యప్ ఉన్నారు. మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రెండు పరిణామాల నేపద్యంలో జమిలీ ఎన్నికల చర్చ రేగుతోంది. జమిలి ఎన్నికల ద్వారా కేంద్రంలో అధికారం పొడిగించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంయ స్థానంలో అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. జమిలి ఎన్నికలనేవి ప్రాంతీయ పార్టీలకు సంకటమని, ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. 

ఈ క్రమంలో జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించడం లేదా వాయిదా వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. చివరి రోజు వరకూ ప్రజా సేవలో ఉంటారన్నారు. అదే సమయంలో త్వరలో జరగాల్సిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని కూడా వాయిదా వేసే ఆలోచన లేదన్నారు. ఇదంతా కేవలం మీడియా చర్చగా కొట్టిపారేశారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ దేశమంతా విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తరువాతే నిబంధనలు ఖరారు చేస్తుందన్నారు. ఈ కమిటీలో ప్రతిపక్షం ఉండాలని భావించే ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేరు చేర్చామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. 

జమిలి ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సమావేశాల వెనుక కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ఇప్పుడే వాటిని వెల్లడించలేనన్నారు. ప్రత్యేక సమావేశాల ఎజెండాను సరైన సమయంలో మాత్రమే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడిస్తారని చెప్పారు. 

Also read: Udayanidhi Stalin: సనాతనం డెంగ్యూలాంటిది నిర్మూలించాల్సిందే, దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News