Devotees Donations In Ayodhya: అయోధ్యకు బాల రాముడిని చూడటానికి భక్తులు తపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వేలాదిగా భక్తులు ప్రతిరోజు రామ్ లల్లాను దర్శనం చేసుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఆలయానికి వస్తున్నారు. అంతే కాకుండా భక్తులు ప్రత్యేకంగా ఆలయానికి వచ్చి భక్తితో కానుకలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
వందల ఏళ్లనాటి కలసాకారమైనందుకు, దేశమంతట జైశ్రీరామ్ అనే నినాదంతో మార్మోగిపోతుంది. ఇదిలా ఉండగా గత నెల జనవరి 22 న దేశ ప్రధాని చేతుల మీదుగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అతీరత మహారథులు,చ సామాన్యులు అనే తేడాలేకుండా అందరికి రామజన్మభూమి ఆలయ ట్రస్ట్ ఆహ్వనాలు అందజేసింది.
Read Also: Snakes: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించి పదకొండు రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 25 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలన్ని కూడా నిండిపోయాయి. ఈ క్రమంలో రామజన్మభూమి ట్రస్ట్ 11రోజుల హుండీ ఆదాయంను లెక్కపెట్టింది.
అయితే.. ఈ విరాళాలను లెక్కపెట్టడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. 11 రోజులలో పదకొండు కోట్లకు పైగా విరాళాల రూపంలో వచ్చాయని ట్రస్ట్ తెలిపింది. దీనిలో.. హుండీలు, విరాళాల ద్వారా.. 8 కోట్లు, చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా ₹ 3.5 కోట్లు విరాళంగా ఇచ్చామని ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook