VHP: అయోధ్య సహా దేశాన్ని మలుపు తిప్పిన విశ్వ హిందూ పరిషత్ కీలక నిర్ణయాలు.. ఉద్యమాలు..

VHP: హిందూ బంధువుల కోసం ఏర్పడ్డ విశ్వ హిందూ పరిషత్ తన ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అంతేకాదు ఈ వీ హెచ్ పి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశ గతినే మార్చివేసాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 26, 2024, 10:18 AM IST
 VHP: అయోధ్య  సహా దేశాన్ని మలుపు తిప్పిన  విశ్వ హిందూ పరిషత్ కీలక నిర్ణయాలు..  ఉద్యమాలు..

VHP: 1966 జనవరి 22, 23, 24 తేదీలలో  ప్రయాగ్ రాజ్ లో జరిగిన  కుంభమేళా సందర్భంగా వీ హెచ్ పీ ఆధ్వర్యంలో మొదటి ప్రపంచ హిందూ సమ్మేళనం జరిగింది. ఇందులో 12 దేశాల నుండి 25 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.  300 మంది ప్రముఖ సాధువులు పాల్గొన్నారు. తొలిసారిగా నలుగురు శంకరాచార్యులందరూ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్  కమిటీని ప్రకటించారు. మైసూర్ మహారాజ శ్రీజయచామ చంద్ర  వడయార్ అధ్యక్షుడయ్యారు. అప్పటికే వారు మద్రాసు ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉండేవారు.  మరియు శ్రీదాదాసాహెబ్ ఆప్టే ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఈ సమావేశంలోనే అనేక కారణాల వలన హిందూ మతాన్ని ఒదిలిపెట్టిన అన్య ఎడారి మతాలలోకి వెళ్ళినవారు తిరిగి తమ పూర్వ ధర్మంలోకి రావచ్చునని చారిత్రాత్మక నిర్ణయించడం జరిగింది.

విశ్వహిందూ పరిషత్ యొక్క నినాదం "ధర్మో రక్షతి రక్షితః " గా నిర్ణయించబడింది మరియు  ‘వటవృక్షం’ అధికార చిహ్నంగా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రపంచ సదస్సు తర్వాత ఆనాటి వివిధ ప్రావిన్సులలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఉడిపి (కర్ణాటక). పంఢరిపూర్ (మహారాష్ట్ర), జోర్హాట్ (అస్సాం), సిద్ధాపూర్ (గుజరాత్) మొదలైన ప్రదేశాల్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి.

 • ఈ సమ్మేళనాలలో వివిధ తీర్మానాలు ఆమోదించబడినాయి.
 || హైందవ సోదరా సర్వే, న హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్రం సమానత||
 
(హిందువులందరూ సోదరులు, ఏ హిందువు కూడా పతితుడు కాడు.మన యొక్క దీక్ష హిందూ సమాజం యొక్క రక్షణ, మన యొక్క మంత్రం మనమందరం సమానం.)  అనే మంత్రాన్ని సాధువులు నిర్ణయించారు. సమాజానికి ఉపదేశించారు.

రెండవ ప్రపంచ హిందూ సమ్మేళనం 1979 జనవరి 27, 28, 29 తేదీలలో ప్రయాగరాజ్ లో జరిగింది, ఇందులో 18 దేశాల నుండి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సదస్సును బౌద్ధ గురువు  దలైలామా ప్రారంభించారు. ఆయనకు పూజ్య జ్యోతిష్పీఠం శంకరాచార్య స్వాగతం పలకడం అప్పట్లో జరిగిన ఓ చారిత్రక సంఘటన.1980 నుండి  మోరోపంత్ జీ పింగళే గారు పరిషత్‌కు మార్గదర్శకులుగా, 1982లో, అశోక్ జీ సింఘాల్, పరిషత్ కేంద్ర సమితిలో సభ్యులయ్యారు అప్పటినుండి  విస్తృతంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1982లో జన్-జాగరణ్ అభియాన్ (సంస్కృతి రక్షా యోజన) మరియు 1983లో ఏకాత్మతా యాత్ర (గంగామాత, భారతమాత యాత్ర) వంటి  పెద్ద పెద్ద  ప్రభావవంతమైన కార్యక్రమాలు వీ హెచ్  పీ  ఆధ్వర్యంలో జరిగాయి. లక్షల గ్రామాలను కలిపిన ఈ 'ఏకాత్మత యాత్ర" లో 6 కోట్ల మంది పాల్గొన్నారు.

‘మొదటి "ధర్మ సంసద్’  న్యూఢిల్లీలో ఏప్రిల్, 1984లో జరిగింది. గత 60 యేళ్లతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో  అనేక సమావేశాలు జరిగాయి, ఇందులో హిందూ ధర్మం లోని సుమారు 125 శాఖలకు చెందిన 12 వేల మంది సాధువులు మరియు ఋషి, మునులు పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్ తొలి సమావేశం 1964 లోనే అడవుల్లో కొండ కోనల్లో ఉన్న మన సోదరులైన పేదవారిని అక్కున చేర్చుకోవడం, షెడ్యూల్డ్ కులాల కాలనీల్లో పేదల బస్తీల్లో సేవాకార్యక్రమాలు ప్రారంభించాలని చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

గోసంరక్షణ మరియు గోసేవ పనులు, ఈ ఏడాది లోనే ఒక లక్షా 90 వేలకు  కు పైన ఆవులు కాపాడగా, ఇప్పటివరకు కోటికి పైగా ఆవులను కసాయిల నుండి విముక్తి చేసారు.  600 కంటే ఎక్కువ గౌశాలలతో అనుసంధానం చేశారు. 175 పంచగవ్య మందుల తయారీ కేంద్రాలు వీ హెచ్ పీ ఆధ్వర్యంలో  నడుస్తున్నాయి.

శ్రీరామజన్మభూమి ఉద్యమం 1984లో ప్రారంభమైంది. శ్రీ రామజానకీ రథయాత్ర, శ్రీరామ శిలాపూజన్, శ్రీరామపాదుకా పూజ, మొదటి కరసేవ (1990) మరియు ఢిల్లీ బోట్ క్లబ్ (ఏప్రిల్ 4, 1991) చారిత్రక ర్యాలీ వంటి భారీ సంఖ్యతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయ వంతంగా  జరిగాయి. ఈ చైతన్యం ఫలితంగా, 6 డిసెంబర్ 1992న కరసేవ,. తదనంతరం కోర్టులు పూనుకొని హిందూ సమాజానికి న్యాయం చేయడం జరిగింది.  శ్రీరామమందిరం నిర్మాణం జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభ కార్యక్రమానికి ఐదు లక్షల 25వేల గ్రామాల నుండి 17 కోట్ల కుటుంబాలను కలిసి ఆహ్వానించడం తెలిసిందే. దీని వెనక అంతా వీ హెచ్ పీ ప్రధాన పాత్ర పోషించింది.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News