హైదరాబాద్: విజయ్ మాల్యా ( Vijay Mallya ) కేసులో ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండగా తాజాగా సుప్రీం కోర్టులో మాల్యా కేసుకు సంబంధించిన పలు కీలక దస్త్రాలు అదృశ్యమవడం చర్చనియాంశమైంది. భారత్‌లోని వివిధ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగవేసిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా ఈ కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఐతే, అతడి కేసుకు సంబంధించిన పేపర్స్ కనిపించకపోవడంతో ప్రస్తుతానికి ఈ రివ్యూ పిటిషన్ విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. Also read: Rakul Preet: ఆ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్
2017 జూలై 14న కోర్టు ఇచ్చిన ఓ తీర్పుని సవాలు చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణలో ఈ ఉదంతం వెలుగుచూసింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. తన పిల్లలకు మాత్రం రూ.40 మిలియన్ డాలర్లు బదిలీ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కోర్టులో ఈ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. Also read: Color Photo teaser: టీజర్‌కి సూపర్ రెస్పాన్స్
Vijay mallya: సుప్రీం కోర్టులో డాక్యుమెంట్స్ మిస్సింగ్