Delhi Police Brutally hits Stray Dog: ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ అధికారి దుడ్డు కర్రతో వీధి కుక్కను చావబాదుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతు సంరక్షణ కార్యకర్త ఒకరు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పోలీస్ అధికారి తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అతనిపై చర్యలు తీసుకుంటామని జాఫ్రాబాద్ పోలీస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ వీడియోలో సదరు పోలీస్ అధికారి లావు పాటి కర్రతో రోడ్డుపై ఉన్న కుక్కను దారుణంగా కొడుతుండటం గమనించవచ్చు. అతని క్రూరత్వానికి ఇక ఆ కుక్క అక్కడి నుంచి కదల్లేకపోయింది. ఆ కుక్క అతన్ని కరవడం వల్లే అతను దాడికి పాల్పడ్డాడని కొంతమంది చెబుతుండగా... అకారణంగా దాన్ని హింసించాడని జంతు సంరక్షణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ పోలీస్ అధికారిని జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్ఐగా గుర్తించారు.
Another CRUELTY case in new delhi. Police officer hit the stray dog. Jafrabad Metro Station. gali no 44 JAFRABAD DELHI. #NOHUMANITYLEFTFORVOICELESS pic.twitter.com/CSuzER5IHq
— VICTOR WELFARE ASSOCIATION (@shashivictor126) January 10, 2022
కుక్కను ఆ ఏఎస్ఐ కర్రతో కొడుతున్న వీడియోను (Viral Video) హరీష్ అనే జంతు సంరక్షణ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాడిలో కుక్క కంటికి గాయమైందని... అది కదల్లేని స్థితిలో ఉందని పేర్కొన్నాడు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. సదరు పోలీస్ అధికారిని జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : Siddharth to Saina : సైనా నెహ్వాల్‌కు హీరో సిద్దార్థ్ బహిరంగ క్షమాపణలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook