లోక్‌సభకు వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాన్ని ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ. టీఎంసీ పార్టీ అమరవీరుల దినం సందర్భంగా నేడు నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ.. వచ్చే నెల(ఆగస్టు)15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బీజేపీ హఠావో.. దేశ్ బచావో (బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ప్రచారం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
We will start 'BJP hatao, desh bachao' campaign on August 15: TMC Chief & West Bengal CM Mamata Banerjee pic.twitter.com/FXMbawUqJd
— ANI (@ANI) July 21, 2018
2019 ఎన్నికల్లో సంచలనం జరగబోతుందన్న ఆమె.. దేశానికి బెంగాల్ దారి చూపిస్తుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 100 కంటే తక్కువ స్థానాలను గెలుస్తుందన్న ఆమె.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ దేశానికి దారి చూపిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని దీదీ పేర్కొన్నారు. తమకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇటీవలే మిడ్నాపూర్‌లో జరిగిన మోదీ బహిరంగ సభలో టెంటు కూలిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'పందిరి సరిగ్గా వేయలేని వారు.. దేశాన్ని ఎలా రక్షిస్తారు' అని ఎద్దెవా చేశారు. టెంట్ కుప్పకూలిన ఘటనలో పదుల సంఖ్యలో మంది గాయపడిన సంగతి తెలిసిందే.
బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు
Former Rajya Sabha MP Chandan Mitra, Former CPM MP Moinul Hasan, Congress's Sabina Yasmin and Mizoram advocate-general Biswajit Deb have joined TMC: TMC Chief & West Bengal CM Mamata Banerjee (File pic) pic.twitter.com/OUYaRXWqcr
— ANI (@ANI) July 21, 2018
బీజేపీ మాజీ ఎంపీ చందన్ మిత్రా, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్ ముఖర్జీ, అబూ తెహర్, షబీనా యాస్‌మిన్, అఖ్రుజ్‌మాన్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలు చేరారు.