West Bengal Road Accident: నిత్యం ఏదో చోట దారులు రక్తసిక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు పొగమంచు కారణంగా అదుపుతప్పింది. కారుతో పాటు ఓ ఆటోపై బోల్తా పడటంతో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
బుధవారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. జల్పాయిగుడి జిల్లా ధుప్‌గుడి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం(Road Accident)లో 13 మంది చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని జల్పాయిగుడి ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే మిథాలీ రాయ్ తెలిపారు.
Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు
West Bengal: 13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district last night, due to reduced visibility caused due to fog. The injured were taken to a hospital. pic.twitter.com/HHUvqCist6
— ANI (@ANI) January 20, 2021
ట్రక్కు ఓవర్ లోడ్‌తో వెళ్లడం ఓ కారణమైతే, పొగమంచు కారణంగా వాహనం అదుపుతప్పిట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినవారు పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందినవారా లేక వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులా.. అనే వివరాలు తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
Also Read: Tirumala: టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook