Karnataka Muda Scam: ముడా స్కామ్ ఏమిటి..?.. భార్య కోసం చేసిన ఆ పని.. సీఎం సిద్దరామయ్య సీటుకే ఎసరు పెట్టిందా..డిటెయిల్స్..

Cm Siddaramiah: కర్ణాటకలో ముడా స్కామ్ ప్రస్తుతం రాజకీయాంగా రచ్చగా మారింది. దీనిపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా సీఎం పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఈరోజు సాయంత్రం.. సిధ్దరామయ్య అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 17, 2024, 05:57 PM IST
  • కన్నడ రాజకీయాల్లో ముడా చిచ్చు..
  • కోర్టుల్లో తెల్చుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య..
Karnataka Muda Scam: ముడా స్కామ్ ఏమిటి..?.. భార్య కోసం చేసిన ఆ పని.. సీఎం సిద్దరామయ్య సీటుకే ఎసరు పెట్టిందా..డిటెయిల్స్..

what in muda scam Karnataka chief minister Siddaramaiah to be prosecuted: కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్ధరామయ్య తన సతీమణికి భూకేటాయింపు పరిహారం విషయంలో లాభాలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని కూడా కొంత మంది ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కన్నడ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తుంది. దీనిపై న్యాయపోరాటానికి కూడా వెళ్తామని కూడా సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2021లో ముడా (మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు.

అయితే.. ఈ భూమి.. విజయనగరంలో భూమి ధర..  కేసరెలో భూమి కంటే రెట్టింపు ఉందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా, ఆర్టీఐ కార్యకర్త ఒక పిటీషన్ సైతం వేశారు. అదే విధంగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో  సీఎం సిద్దరామయ్య... ఈ వివరాలను పొందుపర్చలేదని కూడా ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం ప్రధానంగా ఆరోపణలు చేశారు.

సామాన్యులకు  ఒకలా.. సీఎం సతీమణి కొన్న భూమికి మరోలా పరిహారం చెల్లించడం, అక్కడ భూమి రెట్లు కూడా రెట్టింపుగా ఉండటం వివాదానికి కేంద్ర బిందువుగామారింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త అబ్రహంతోపాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా సీఎంపై కేసు ఘటన కావడంతో పోలీసులు.. గవర్నర్ ను కలిశారు. రాజ్యంగం ప్రకారం  గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సూచనల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటనపై కాంగ్రెస్ సర్కారు మండిపడుతుంది. బీజేపీ కాంగ్రెస్ సర్కారును కూలగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు.

మరోవైపు... సిద్దరామయ్య పై ముడా ల్యాండ్ స్కామ్,  అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై విచారణకు అనుమతి ఇవ్వాలని కూడా ఫిర్యాదు దారుడు గవర్నర్ ను డిమాండ్ చేయడం ప్రస్తుతం వార్తలలో  నిలిచింది. సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు, ముడా కమిషనర్‌పై కూడా కేసు నమోదు చేయాలని అబ్రహం తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు. ముడా కుంభకోణంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాన్నారు. . ఇటీవల గవర్నర్ ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసు పంపించారు.

సీఎం సిద్దరామయ్య ఫైర్..

మరోవైపు సీఎం సిద్దరామయ్య గవర్నర్ తీరును తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణకు అనుమతి ఇవ్వడంను .. న్యాయపరంగా తెల్చుకుంటామన్నారు. బీజేపీ, జీడీఎస్ లు కలిసి తమ ప్రభుత్వంపైకుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. క్యాబినెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు అనుకూలంగానే ఉన్నారన్నారు. దీనిపైన న్యాయపోరాటం చేస్తు.. ప్రజల్లోకి దీనిపై వెళ్తామని సీఎం సిద్దరామయ్య అన్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి సైతం.. సిద్ధరామయ్యకు అండగా నిలుస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News