Viral news: తాత వయసు ఉన్న వ్యక్తిని వివాహమాడిన యువతి! ఎక్కడంటే...

Strange love story: అమెరికాలో విచిత్ర ప్రేమకథ వెలుగుచూసింది. తాత వయసు గల వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 06:05 PM IST
Viral news: తాత వయసు ఉన్న వ్యక్తిని వివాహమాడిన యువతి! ఎక్కడంటే...

Girl Love With Old Man: ప్రేమకు వయసుతో పనిలేదు. పలానా ఏజ్ లోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ఓ అమ్మాయి తన తాత వయసు ఉన్న వ్యక్తిని ప్రేమించి...పెళ్లి చేసుకుంది. ఈ వెరైటీ ప్రేమకథ అమెరికా(America)లోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివాహం తర్వాత అమ్మాయి తన ఇంటికి వచ్చినప్పుడు..ఆమె తల్లిదండ్రులు ఆ వృద్ధ వ్యక్తిని పోలీసులకు పట్టించారు.

వివరాల్లోకి వెళితే...
19 ఏళ్ల ఆడ్రీ చెయాన్-స్మైలీ మూన్ 61 ఏళ్ల కెవిన్ అనే వ్యక్తిని వివాహం(Marriage) చేసుకుంది. మొదటగా డేటింగ్ యాప్(Dating App) ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆడ్రీ, కెవిన్ భార్యాభర్తలు అయినప్పటికీ వారిజంట తాత మనవరాల మాదిరిగా ఉంది.

ఆడ్రీ ఒక సైనిక పోలీసు అధికారి. జనవరి 2020లో ఆమె ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లో కెవిన్‌ను కలిసింది. అతడు తనను బాగా ఆకర్షించాడని ఆడ్రీ చెప్పింది. కెవిన్ మిలటరీ పోలీసులో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడు. కెవిన్ తన కంటే 42 సంవత్సరాలు పెద్దవాడని ఆడ్రీకి ముందే తెలుసు. అయినా కానీ ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. కొన్ని నెలల్లోనే ఇద్దరూ ఐలవ్‌ యూ చెప్పుకున్నారు. తర్వాత వారి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆడ్రీ వయసు తన ప్రేమ(Love)కు అడ్డుకాదని కెవిన్ చెబుతున్నాడు.

Also Read: Viral news: రైతు ఖాతాలో రూ. 52 కోట్లు..షాకైన అధికారులు! అసలేం జరిగిందంటే...

అయితే కెవిన్‌కి అప్పటికే వివాహం అయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కెవిన్ పెద్ద కుమారుడు ఆడ్రీ కంటే పెద్దవాడు. అదే సమయంలో ఆడ్రీ తల్లిదండ్రులు కూడా కెవిన్ కంటే చిన్నవారు. తల్లికి 38 సంవత్సరాలు, తండ్రికి 43 సంవత్సరాలు ఉంటాయి. తన కూతురి సంబంధాన్ని అంగీకరించడానికి వారికి చాలా సమయం పట్టింది. అయితే తమ బంధానికి కెవిన్ పిల్లలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆడ్రీ తెలిపింది. తమ జంటను చూసి వారు మురిసిపోతున్నారని వివరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News