Benefits of Inguva: చిటికెడు ఇంగువతో హై బీపీకి చెక్..! దీనిని వెంటనే డైట్ లో చేర్చుకోండి

Benefits of Asafoetida: మారిన జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి  బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించడంలో ఇంగువ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 05:05 PM IST
  • ఇంగువతో బోలెడు ప్రయోజనాలు
  • ఉదర సంబంధిత వ్యాధులు, హై బీపీ దూరం
Benefits of Inguva: చిటికెడు ఇంగువతో హై బీపీకి చెక్..! దీనిని వెంటనే డైట్ లో చేర్చుకోండి

Benefits of Asafoetida For High BP Patients: మనం వంటలలో వాడే సుగంధ ద్రవ్యాలలో ఇంగువ ఒకటి. దీనిని దాదాపు ప్రతి ఇంట్లో వాడతారు. ఇది ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులను దూరం  చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రస్తుత రోజుల్లో హై బీపీ (High Blood Pressure) సాధారణ సమస్యగా మారిపోయింది. దీనిని తగ్గించడానికి ఇంగువను (Benefits of Asafoetida) ఉపయోగించవచ్చు. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంలో ఇంగువ వాడండి
ఇంగువను ఉపయోగించడానికి ఉత్తమమైన మరియు సులభమైన మార్గం ఆహారంలో చేర్చడం. అందుకోసం ఇంట్లో తయారుచేసే అన్ని కూరల్లోనూ ఇంగువను ఉపయోగించండి. దీని వల్ల మీ ఆహారం రుచి పెరగడమే కాకుండా బీపీ కూడా అదుపులో ఉంటుంది.  

తేనె-పొడి అల్లంతో ఇంగువ
రక్తపోటు ఉన్న రోగులు తేనె మరియు పొడి అల్లం పొడితో ఇంగువను తీసుకోండి. ఇది మీకు ఉబ్బసం మరియు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది మరియు మీ బీపీని నియంత్రణలో ఉంచుతుంది. 

రాతి ఉప్పుతో ఇంగువ
ఆహారం తిన్న తర్వాత అర టీస్పూన్ ఇంగువను తీసుకుని, దానికి చిటికెడు రాతి ఉప్పు కలిపి, గోరువెచ్చని నీటితో తీసుకుంటే.. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా హైబీపీకి చెక్ పెడుతుంది. 

Also Read: Toothache Home Remedies: పంటి నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News