Benefits of Multani Mitti: ముఖాన్ని సౌందర్య వంతంగా చేసుకోవడానికి అందరు ముల్తానీ మిట్టిని వాడుతుంటూ ఉంటారు. ఇది చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తుంది. కాబట్టి దీనితో బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ముల్తానీ మిట్టి వాడడం వల్ల కేవలం చర్మానికి ప్రయోజనాలుంటాయని తెలుసు..! కానీ ఇది శరీర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కాల్షియం, హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్, సోడియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ముల్తానీ మిట్టి శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
ముల్తానీ మిట్టి ప్రయోజనాలు:
1. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
పెరుగుతున్న వయస్సు లేదా శరీర సమస్యల కారణంగా కీళ్ల, కండరాల నొప్పులు వస్తుంటాయి. పాదాలు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే.. నొపి ఉన్న చోట తప్పకుండా ముల్తానీ మిట్టిని అప్లై చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో వాపులు కూడా తొలగిపోతాయి.
2. రక్త ప్రసరణ మెరుగుపరుచుతుంది:
ముల్తానీ మిట్టి సహాయంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మట్టిని నీటిలో నానబెట్టి పేస్ట్ తయారు చేసి.. ఆపై శరీర భాగాలపై రుద్దండి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేసిన కొద్ది సమయంలోనే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడిందని నిపుణులు చెబుతున్నారు.
3. కడుపులో చికాకు:
ముల్తానీ మిట్టి ప్రభావం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీని సహాయంతో కడుపులో ఎసిడిటీ, మంటను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం.. మట్టిని సుమారు 5 గంటలు నానబెట్టి, ఒక పాత్రలో ఉంచి.. తర్వాత పొట్టను గుడ్డతో కట్టి అరగంట సేపు ఉంచి తర్వాత దాన్ని తీసివేయాలి. ఇలా చేయడం వల్ల కడుపులో చికాకు తగ్గుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook