Blood Pressure Control: ప్రస్తుతం 30 ఏళ్లు నిండకముందే అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య కారణంగా చాలామందిలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే యువతలో ఇలాంటి సమస్యలు రావడానికి ఆధునిక జీవనశైలితో పాటు అనారోగ్యకరమైన ఆహారాలు అధిక తీసుకోవడమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తో బాధపడేవారు తప్పకుండా పాలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆరోగ్యం పై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు తప్పకుండా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాను పాటించడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు దాల్చిన చెక్కతో తయారు చేసిన పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకుండా ఈ గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క తో పాటు నిమ్మ రసాన్ని కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయట. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ నీటిని తాగవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకునేందుకు అల్పాహారంలో చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించి గుండె వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook