Brass Utensils Cleaning: ఇత్తడి పాత్రలను ఇలా సులభంగా శుభ్రం చేయండి..!!

Brass Utensils Cleaning: భారతీయులు వంట పాత్రలను రకరకాల లోహాలతో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తారు. కొంత మంది కిచెన్‌లో స్టీలు పాత్రలు వాడడానికి కూడా ఇష్టపడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 04:32 PM IST
  • ఇత్తడి పాత్రలను సులభంగా శుభ్రం చేయండి
  • బేకింగ్ సోడా సహాయంతో శుభ్రం చేయండి
  • చింతపండు గుజ్జు ఇత్తడి వస్తువులను పాలిష్ చేస్తుంది
Brass Utensils Cleaning: ఇత్తడి పాత్రలను ఇలా సులభంగా శుభ్రం చేయండి..!!

Brass Utensils Cleaning: భారతీయులు వంట పాత్రలను రకరకాల లోహాలతో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తారు. కొంత మంది కిచెన్‌లో స్టీలు పాత్రలు వాడడానికి కూడా ఇష్టపడతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయాల్లోని ఇత్తడితో చేసిన దీపాలు, విగ్రహలు వినియోగించడం ఆనవాయితీ. అయితే వీటిని అతిగా ఉపయోగించడం వల్ల నల్లగా మారుతాయి. ఈ జిడ్డును వదిలించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం మెరుపు కంటే ఇత్తడి మెరుపు చాలా తక్కువగా ఉంటుంది. కావున వీటిని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల ఇత్తడి నల్లగా మారుతుంది. అయితే ఇత్తడిని మెరిసేలా చేయడం చాలా కష్టం. కొన్ని చిట్కాలను ఉపయోగించి ఇత్తడి పాత్రలను చిటికెలో మెరిసిపోయేలా చేయోచ్చు.

బేకింగ్ సోడా సహాయంతో:

ఇత్తడి వస్తువులను బేకింగ్ సోడా ఉపయోగించి మెరిసేలా చేయెచ్చు. దీని కోసం.. ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసుకోని అందులో నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఇత్తడి విగ్రహాలు, దీపాలు, పాత్రలపై రాసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఈ వస్తువులను శుభ్రం చేయాలి.

వెనిగర్:
వెనిగర్ సహాయంతో ఇత్తడి వస్తువుల నల్లదనాన్ని తొలగించవచ్చు. దీని కోసం..ఇత్తడి వస్తువులపై వెనిగర్ రాసి.. ఉప్పుతో స్క్రబ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో కడిగాలి.

నిమ్మ రసం, ఉప్పు:

నిమ్మరసం, ఉప్పుతో కూడా ఇత్తడిని వస్తువులను శుభ్రం చేయెచ్చు. దీని కోసం 1 టీస్పూన్ ఉప్పులో నిమ్మరసం కలిపి రాగి వస్తువులపై కాసేపు రుద్దాలి. దీని తర్వాత ఇత్తడి పాత్రలను వేడి నీటితో శుభ్రం చేయాలి.

చింతపండు:

చింతపండు గుజ్జు ఇత్తడి వస్తువులను పాలిష్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం చింతపండును నీళ్లలో నానబెట్టి..15 నిమిషాల తర్వాత చింతపండును గుజ్జులా చేసి, ఈ గుజ్జును ఇత్తడి వస్తువుకు స్క్రబ్ చేయండి.

Also Read: Wood Apple Benefits: మారేడు పండుతో శరీరాని ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Also Read: Turmeric On Face Benefits: పసుపును చర్మానికి అతిగా వినియోగిస్తున్నారా..అయితే ప్రమాదమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News