Dark Circles Remedies: డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఐ మాస్క్‌తో 7 రోజుల్లో చెక్‌!

How To Make Rice Flour Under Eye Mask: ప్రస్తుతం ఒత్తిడి కారణంగా చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 16, 2023, 01:07 PM IST
Dark Circles Remedies: డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఐ మాస్క్‌తో 7 రోజుల్లో చెక్‌!

How To Make Rice Flour Under Eye Mask: ప్రతి ఒకరు అందమైన ఆకర్షణీయమైన కళ్లు ఉండాలని కోరుకుంటారు. అనారోగ్య సమస్యలు, వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలా మందిలో  కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి ఐ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల సులభంగా కళ్ల కింద నల్లటి వలయాల(డార్క్ సర్కిల్స్) సమస్యలు దూరమవుతాయి.

ఐ మాస్క్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • ఒక టెబుల్‌ స్పూన్‌ బియ్యం పిండి
  • ఒక టెబుల్‌ స్పూన్‌ క్రీమ్

రైస్‌ ఫ్లోర్‌తో ఐ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో తెలుసా?:
బియ్యపు పిండి అండర్ ఐ మాస్క్ చేయడానికి తప్పకుండా ఒక బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ బౌల్‌లో ఒక చెంచా బియ్యప్పిండితో పాటు 1 స్పూన్ క్రీమ్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండింటీని బాగా మిక్స్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
అంతే సులభంగా రైస్‌ ఫ్లోర్‌తో ఐ మాస్క్‌ తయారైనట్లే..

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

ఐ మాస్క్‌ను ఎలా అప్లై చేయాలో తెలుసా?:
ఈ మాస్క్‌ను అప్లై చేయడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 
మాస్క్‌ను కళ్ల కింద నల్లటి వలయాలపై బాగా అప్లై చేయాలి. 
ఆ తర్వాత తేలిక పాటి చేతులతో మసాజ్‌ చేయాలి. 
20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతేకాకుండా సులభంగా  డార్క్ సర్కిల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x