Garika Gaddi Uses: గరిక గడ్డితో కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా...?

Garika health benefits: గరిక గడ్డి తెలియని వారు ఉండరు. దీనిని. ప్రత్యేకంగా వినాయకుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా పొలాల గటంల మీద‌, చేల‌ల్లో, మన ఇంటి పెరిటిలో పెరుగుతుంది.  అయితే ఇది ఆధ్యాత్మికంగానే కాదు ఔష‌ధంగా కూగా గ‌రిక మ‌న‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు దీనిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 01:45 PM IST
Garika Gaddi Uses: గరిక గడ్డితో కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా...?

Garika Health Benefits: సాధారంగా గరిక అంటే పచ్చ రంగులో ఉంటుంది. మీకు తెలుసా గరికలో వివిధ రకాలు కూడా ఉన్నాయి. తెల్ల గ‌రిక, న‌ల్ల గ‌రిక‌ ఉంటాయి. ఇందులో నల్ల గరిక కంటే తెల్ల గరిక శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

గరికతో కలిగే ప్రయోజనాలు ఇవే..

గరికను కొందమంది ఔషదంగా తీసుకుంటారు. దీని వల్ల  గాయాలు మానడంలో,  చ‌ర్మ రోగాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

అనారోగ్య సమస్యల బారి పడకుండా ఉండానికి గరిక ఎంతో సహాయపడుతుంది. 

గరిక గడ్డిని పేస్ట్  చేసి ఇందులో నెయ్యి కలిపి చర్మంపై అప్లై చేసుకోవడం వల్ల చర్మ పై ఏర్పడే పొక్కులు సులభంగా తగ్గిపోతాయి.

అల్సర్ తో బాధపడుతున్న వారు గరికను బాగా ఎండబెట్టి పొడిలా మార్చుకుని ప్రతిరోజు అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకుని త్రాగటం వల్ల అల్సర్లు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు.  

చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో గరిక ఆకుల రసాన్ని ఉమరిగించి రోజు తలకు రాసుకుంటే చుండ్రు సమస్యలు దూరమౌతాయి.

మహిళల్లో వచ్చే వైట్ డిశ్ఛార్జీ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. గరికవేళ్ళను దంచి రెండు టీస్పూన్ల గరిక పేస్టును ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది. 

Also Read: Multivitamins Benefits: మల్టీవిటమిన్ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News