White hair solution: తెల్ల జుట్టు అనేది ప్రస్తుతం యువతను సతాయిస్తున్న ప్రధాన సమస్య. స్కూల్ చదివే పిల్లలకి కూడా ఈ రోజుల్లో తెల్ల జుట్టు సర్వసాధారణమైపోతోంది. అలాగని తెల్ల జుట్టును దాచుకోవడానికి హెయిర్ కలర్స్ వాడడం మొదలుపెడితే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. ఇలా జుట్టు ఊడిపోవడానికి, తెల్లగా మారిపోవడానికి అసలు కారణం మన శరీరానికి అవసరమైన పోషక విలువలు అందకపోవడమే.
సరియైన ఆహారం, నిద్ర ఆరోగ్యానికే కాదు మన జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతో అవసరం. అనవసరంగా తీసుకునే స్ట్రెస్ వల్ల కూడా త్వరగా తెల్ల జుట్టు రావడం జరుగుతుంది. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా ఎన్నో కారణాల వల్ల రాలిపోయే జుట్టుని పటిష్టం చేయడానికి ఈ మూడు ఆహార పదార్థాలను పడుకునే ముందు లేక పొద్దున పూట తీసుకుంటే సరిపోతుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందామా..
ఆమ్లా:
చాలామంది కేవలం ఊరగాయకి మాత్రమే పనికొస్తుంది అనుకునే ఉసిరికాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే హెయిర్‌కు సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ లో ఉసిరికాయని వాడుతారు. రోజు ఉసిరికాయ తీసుకోవడం వల్ల మన జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరగడమే కాకుండా అవసరమైన పోషకాలు అందడంతో త్వరగా తెలబడదు.
బృంగరాజ్
మనం పాడే షాంపూల దగ్గర నుంచి హెయిర్ ఆయిల్స్ వరకు విపరీతంగా ఉపయోగించే ఈ బృంగరాజ్ వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు ఇందులో మెండుగా లభ్యమయ్యే కాల్షియం, మెగ్నీషియం జుట్టుని పటిష్టంగా చేస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ,మినరల్స్ జుట్టు రాలడం నివారిస్తుంది.
కరివేపాకు
కూరలో తిరగమాతకు ఉపయోగించే కరివేపాకులో విటమిన్ బి 6,బీటా కెరోటిన్ తో పాటు అధిక మోతాదులో ప్రోటీన్లు లభ్యమవుతాయి. ఇవి జుట్టును మూలాల నుంచి బలంగా చేస్తాయి. చుండ్రులను తగ్గించడంతోపాటు బాల నేర్పును నివారిస్తాయి.
అయితే వీటిని నేరుగా అలాగే తినలేము కదా అందుకే వీటన్నిటినీ ఉపయోగించి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుంటాం. వీటి పొడిని నేతిలో కలిపి ఉండలా చేసుకుని రోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఒక్కసారి తయారు చేసుకుంటే ఈ ఉండలు సులభంగా ఒక వారం రోజులపాటు ఫ్రిజ్లో భద్రపరచుకోవచ్చు.ఈ ఉండలు ఓ 15 రోజులు పాటు తిన్నారంటే చాలు మీకు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter