Hemoglobin Increase: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆహారాలతో 5 రోజుల్లో హిమోగ్లోబిన్ లోపానికి చెక్‌..

Hemoglobin Increase Food: ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న చిట్కాలను వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 02:28 PM IST
Hemoglobin Increase: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆహారాలతో 5 రోజుల్లో హిమోగ్లోబిన్ లోపానికి చెక్‌..

Hemoglobin Increase Food: హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో కనిపించే ఓ ప్రోటీన్ లాంటి పదార్థం. ఇది ఆక్సిజన్ ని శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్లేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది ఆధునిక జీవనశైలిన అనుసరించడం వల్ల హిమోగ్లోబిన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు.. శరీరంలో తగినంత హీమోగ్లోబిన్ పరిమాణాలు లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరిలోనైతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి ఈ లోపం ఉన్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటిస్తే ఫలితాలు పొందుతారు.

ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి:
ఆకుపచ్చని కూరగాయల్లో శరీరానికి మేలు చేసే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, బ్రోకలీని ఆహారాల్లో అతిగా తీసుకుంటే హీమోగ్లోబిన్ లోపం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

చాలామంది డ్రై ఫ్రూట్స్ ను బరువు తగ్గే క్రమంలో అనుసరించే డైట్ లో వినియోగిస్తుంటారు. అయితే ఏమో గ్లోబల్ సమస్యలు ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్ ను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే సులభంగా ఆ సమస్య నుంచి పొందవచ్చు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

గుమ్మడికాయ గింజలను చాలామంది జట్టు సమస్యలకు వినియోగిస్తారు. కూడా చాలా రకాల పోషక గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో వినియోగిస్తే శరీరానికి తగిన పరిమాణంలో ప్రోటీన్స్ అంది.. హిమోగ్లోబిన్ లోపం సమస్యలు దూరం అవుతాయి.

తృణధాన్యాలు కూడా రక్తంలోని హిమోగ్లోబిన్ ని పెంచేందుకు సహాయపడతాయి ఇందులో పోషక విలువల పరిమాణాలు అధికంగా ఉంటాయి.. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి.

Also Read: North Korea: ఆమ్మో.. సినిమా చూశారని చిన్న పిల్లల్ని చంపేశారు.. దారుణ ఘటన వెలుగులోకి!

Also Read: Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News