Onion Juice For Diabetes: మధుమేహం కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు కూడా మానుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో మధుమేహం వస్తే కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల మూలికలను వినియోగించాల్సి ఉంటుంది.
రక్తంలో చక్కెర పరిమాణాలు రోజురోజుకు పెరిగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా వీటిని నియంత్రించుకోవడానికి ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మధుమేహం తగ్గడానికి ఉల్లిపాయ రసం:
మధుమేహాన్ని నియంత్రించడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతి రోజూ ఉల్లిపాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల టైప్ -1, టైప్ -2 రోగులకు ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
ఉల్లిపాయను అనేక రకాలుగా తింటూ ఉంటారు. ఇవి వేయకుంగా ఆహార పదార్థాలు తయారు చేయడం చాలా కష్టం. కాబట్టి ఆహార పదార్థాలు రుచి కోసం ఉల్లిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే వీటి రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
ఉల్లిపాయను ఉడకబెట్టి దాని రసం తీసి తాగితే శరీరానికి డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీ వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉల్లిపాయ రసాన్ని తయారు చేసుకోవడానికి:
మీడియం సైజు 2 ఉల్లిపాయను ముక్కలుగా కోయాల్సి ఉంటుంది. మిక్సీ గ్రైండర్‌లో వేసి 1 కప్పు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా రసాన్ని తయారు చేసుకున్న తర్వాత రోజుకు ఒక గ్లాసు రసాన్ని తాగితే శరీరానికి ఫైబర్, పోషకాలు అందుతాయి. అంతేకాకుండా శరీరంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook