Cholesterol Reduce Tips: బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కు శాశ్వతంగా వీటితో 8 రోజుల్లో బైబై చెప్పండి..

How To Reduce Cholesterol In 8 Days: తీవ్ర అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పోషకాలు లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలై ఉండడం. అయితే ప్రతిరోజు అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాను వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 03:47 PM IST
  • ఓట్స్, ద్రాక్ష, స్ట్రాబెరీలు, బెండకాయలు..
  • ప్రతి రోజూ ఆహారంలో తింటే..
  • 8 రోజుల్లో బ్యాడ్‌ కొలెస్ట్రాల్ తగ్గుతుంది
Cholesterol Reduce Tips: బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కు శాశ్వతంగా వీటితో 8 రోజుల్లో బైబై చెప్పండి..

How To Reduce Cholesterol In 8 Days: ఆధునిక జీవనశైలి కారణంగా యువత అంతా అనారోగ్య కరమైన ఆహారాలను తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరిగిపోయి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, నాళాల వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారపు అలవాటులను ప్రతిరోజు పాటిస్తే సులభంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహార అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారంలో వీటిని తీసుకోండి:
ఓట్స్:

కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చాలామంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం పొందలేకపోతున్నారు. అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఓట్స్ని అల్పాహారంలో తీసుకుంటే సులభంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది కాబట్టి పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

పండ్లు:
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా పండ్లు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొవ్వు నియంత్రణకు ప్రతిరోజు ఆహారంతో పాటు యాపిల్ పండ్లు ద్రాక్ష, స్ట్రాబెరీలు, నారింజ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. 

బెండకాయ:
బెండకాయలో కూడా కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే సులభంగా ఆరోగ్యంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు.

చేపలు:
చేపల్లో కూడా కొలెస్ట్రాల్ ను నియంత్రించే చాలా రకాల గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా చేపలను ఆహారంలో వినియోగించాలి.

Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News