Natural Pain Killer: అనారోగ్య కారణాల వల్ల బాడీ పెయిన్ వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్‌ని వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాల వంటి సమస్యలు వస్తాయని చాలా మంది తెలియదు. వీటిని తరచుగా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని అతిగా వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కేవలం తీవ్ర నొప్పులు ఉన్నప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్‌ని వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ వినియోగించకుండా కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించి కూడా సులభంగా చెక్ పెట్టొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నొప్పులను తగ్గించే హోం రెమిడీస్:
1) పెరుగు:
సాధారణ అందరూ ఆహారంలో పెరుగును తీసుకునేందుకు ఇష్టపడతారు. అయితే పెరుగును నొప్పులతో బాధపడుతున్నవారు తీసుకుంటే అన్ని నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యను కూడా సులభంగా తగ్గించడానికి కృషి చేస్తాయి. కడుపు నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2) పుదీనా:
పుదీనా కండరాల నొప్పి, తలనొప్పి, న్యూరల్జియా నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అయితే దీని కోసం ముందుగా మీరు ఆకులను తీసుకుని పచ్చిగా నమలండి. ఇలా చేస్తే జీర్ణ క్రియ సమస్యలు, నొప్పులు సులభంగా తగ్గుతాయి. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పుదీనా ఆకులను నమలండి.
3) అల్లం:
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పి, కీళ్లనొప్పులు, పొత్తికడుపు నొప్పి, ఛాతీ వంటి సమస్యలను సులభంగా దూరం చేస్తుంది. గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి పచ్చి అల్లాన్ని నమలండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook