Neck Fat Exercises: ప్రస్తుతం భారత్ ప్రతి 10 మందిలో 8 మంది అనారోగ్య సమస్యలకు గురవుతురన్నారు. ముఖ్యంగా బరువు పెరడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి పలు రకాల వ్యాయామాలు చేయడం చాలా అవసరం. కానీ ప్రస్తుతం బరువు పెరగడమే కాకుండా మెడ చుట్టూ కొవ్వ పేరుకుపోవడం వంటి సమస్య బారిన పడడం విశేషం. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వ్యాయమం చేయడం చాలా మంచిది. అయితే మెడ చుట్టూ కొవ్వు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెడ కొవ్వు తగ్గించే వ్యాయామాలు ఇవే:
ఫిష్ లిప్ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాయమం కొవ్వును తగ్గించడానికి మెడపై మంచి ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కావున ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేయాలని నిపుణులు పేర్కొన్నారు.
బంతి వ్యాయామం:
పేరులో ఉన్నట్లే వ్యామాన్ని బంతితో చేయాల్సి ఉంటుంది. అయితే మెడ చుట్టూ కొవ్వును నియంత్రించేందుకు టెన్నిస్ బంతిని కూడా వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ఒక బంతిని తీసుకుని గద్వా కింద పెట్టుకుని బంతిని నొక్కాలి. ఇలా చేయడం వల్ల సమస్య సూలభంగా తొలగిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నోబుల్ వ్యాయామం:
కూర్చొని చేసే వ్యాయామం వల్ల కూడా మెడలో దగ్గర కొవ్వును నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు ముందుగా నడుము నిటారుగా ఉంచి.. కుర్చీపై కూర్చోవాలి. ఇప్పుడు మీ తలను సవ్యదిశలో తిప్పండి. కానీ మీ భుజాలను కదలకండి. ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమవుతాయి.
పుష్ అప్స్:
పుష్ అప్స్ చేయడం వల్ల కూడా మెడ చుట్టూ సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల కూడా శరీరం దృఢంగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook