Oral Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే వీటిని శుభ్రం చేయడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల దంతాలు శుభ్రం కావడమేకాకుండా దృఢంగా మారుతాయి. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ కారణంగా నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దంతాలపై మురికి ఫలకం పేరుకుపోయి ఒక పొరలా తయారు అవుతుంది. ఇది దంతాలకు సంబంధించిన తీవ్ర వ్యాధులకు దారీ తీస్తోంది. దీని కారణంగా చాలా మందిలో దంత క్షయ కూడా దారి తీస్తోంది. అయితే ఇటీవలే నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం భారత్‌లో ప్రతి వందలో నలుగురిలో నోటి శుభ్రత పాటించకపోవడం వల్ల కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోటిని శుభ్రంగా చేసుకోకపోతే.. కాలేయ క్యాన్సర్ రావొచ్చు:
క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. నోటి పరిశుభ్రత పాటించకపోతే చాలా మందిలో కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం, నోటి పూతల, దంతాల నష్టం లేదా కంకషన్ వంటి నోటి వ్యాధులు ఉన్నవారికి హెపాటోసెల్లర్ కార్సినోమా వచ్చే ప్రమాదం 75 శాతం ఉందని ఇటీవలే అధ్యయాల్లో పేర్కొంది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్‌కు దారీ తీయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
పరిశోధనలు ఇలా పేర్కొన్నాయి:
బ్రిటన్‌లో 4.5 లక్షల మందిపై చేసిన అధ్యయనం ప్రకారం.. నోటి శుభ్రత పాటించపోవడం, జీర్ణశయ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలున్నాయని పేర్కొంది. పరిశోధనలో పాల్గొన్న వారిలో 4,069 మందికి 6 సంవత్సరాలలో జీర్ణశయాంతర క్యాన్సర్ వచ్చినట్లు పరిశోధకులు కనుగొన్నారు. వీరు నోటి శుభ్రత పాటించక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయని నిపుణులు వారు తెలిపారు.
నిపుణులు ఏమంటారు?
నోటి శుభ్రత పాటించక పోవడం వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుందనే ప్రశ్నకు.. రెండు జవాబులున్నాయి. మొదటి నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల పోషకాలున్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభించవు. దీంతో ఇది కాలేయ క్యాన్సర్‌కు కారణాలు కావొచ్చు. కాబట్టి ఇప్పటికే నోటి సమస్యలతో బాధపడేవారు. తప్పకుండా నోటిని శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook