Persians Beauty Secrets: పర్షియన్‌ భామల అందం వెనుకున్న రహస్యాలు ఇవే, అందుకే అంత అందం వారి సొంతం

Persians Beauty Secrets: ప్రపంచం మొత్తంలో ఆ అందగత్తెల (beauties) అందం చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే.  వారే పర్షియా భామలు (Persian women). గోధుమ రంగు మేనిఛాయతో, నీలి కళ్లతో అందానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు వారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 10:18 PM IST
  • సహజ పద్ధతులతో అందాన్ని పెంచుకునే భామలు
  • ఇంట్లో దొరికే పదార్థాలతోనే ప్యాక్‌లు
  • కుంకుమ పువ్వుతోనే వారికి మేని ఛాయ సొంతం
Persians Beauty Secrets: పర్షియన్‌ భామల అందం వెనుకున్న రహస్యాలు ఇవే, అందుకే అంత అందం వారి సొంతం

Persians Beauty Secrets: మగువకు అందమే ఓ పెద్ద ఆభరణం. చాలా మంది అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో పాట్లు పడుతుంటారు. కానీ ప్రపంచం మొత్తంలో ఆ అందగత్తెల (beauties) అందం చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే.  వారే పర్షియా భామలు (Persian women). గోధుమ రంగు మేనిఛాయతో, నీలి కళ్లతో అందానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు వారు.  మరి అంత అందం వారి సొంతం కావడానికి కారణం..  వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే (Natural remedies). వీరి సౌందర్యం వెనకున్న ఆ రహస్యాల గురించి మనం తెలుసుకుదాం. 

పాలతో స్నానం

కాలుష్యం మన చర్మాన్ని కాంతివిహీనంగా మారుస్తుంది. దుమ్ము, ధూళి వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది.  నిర్జీవంగా తయారైన చర్మాన్ని కాంతివంతంగా మార్చేది మిల్క్‌ బాత్‌ (milk bath).  పర్షియా భామలు (persian beauties) పాటించే సౌందర్య పద్ధతిలో ఇది ప్రధానం. వారు స్నానం చేసే నీటిలో కొన్ని పాలను కలుపుకొని కాసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్లే వారి చర్మం (skin) ఎప్పుడూ నిగారింపును కోల్పొదు. మేని ఛాయ రెట్టింపవుతుంది. అలాగే బాత్‌టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి...  అందులో ఆలివ్, కొబ్బరి లేదా బాదం వీటిలో ఏదో ఒక రకం నూనెను కొన్ని చుక్కల వేసి ఆ నీటితో స్నానం చేస్తారు. దీంతో చర్మం సహజ తేమను (Natural moisture) కోల్పోదు. అలాగే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను (Dead cells)తొలగించుకోవడానికి వారు స్నానం చేసే నీటిలో సముద్రపు ఉప్పును కలుపుకొంటారు. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. 

Also Read : Nose Hair Waxing effects : ముక్కులో వెంట్రుకలు తీసేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే

కాఫీ స్క్రబ్‌తో ప్యాక్‌

కాఫీ స్క్రబ్‌ (Coffee scrub) ఈ అందాల భామల చర్మ రహస్యాలలో ఒకటి. కాఫీ పొడి, తేనె సమపాళ్లలో తీసుకొని తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి, వీపుకి ప్యాక్‌లా వేసుకుంటారు. ఆపై నెమ్మదిగా, మృదువుగా మసాజ్‌ (Massage) చేసుకుంటారు. అలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. దీంతో నిగారింపు కూడా మన సొంతమవుతుంది. కలబంద (aloe vera) గుజ్జుతో చర్మాన్ని మసాజ్‌ చేసుకుంటారు  పర్షియన్‌ అతివలు. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడడంతో పాటు మోముపై ఉండే మచ్చలు, మొటిమలు (pimples) కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. వయసు పైబడిన ఛాయలను తగ్గించడంలో కూడా ఈ కలబంద  ఎంతో సమర్థంగా పనిచేస్తుంది.

కుంకుమ పువ్వుతో మేని ఛాయ

పర్షియన్ భామలు స్నానానికి ముందు  వారి దేశ సంప్రదాయం ప్రకారం వైట్‌ వాటర్‌ (White water) లేదా సెఫీడ్యాబ్‌ అని పిలిచే చాక్‌పీస్‌లాంటి పదార్థాన్ని వాడతారు. కిసే అనే గరుకైన వస్త్రంపై రుద్దడం ద్వారా అది పొడిగా రాలుతుంది. దాన్ని వారు స్నానానికి ముందు నలుగుగా వాడతారు. వీరు తమ మేని ఛాయను రెట్టింపు చేసుకోవడానికి కుంకుమ పువ్వును (Saffron flower) వాడుతారు. పావు కప్పు పెరుగుకు, అర టేబుల్‌స్పూన్‌ కుంకుమ పువ్వు, టేబుల్‌ స్పూన్‌ తేనెను (honey) కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. దాన్ని చర్మంపై పూతలా పూసుకుని ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా సహజంగా పర్షియ మగువలు తమ అందాన్ని కాపాడుకుంటారు. అలా మనం చేస్తే మనమూ చేస్తే వారి కంటే రెట్టింపు అందం మన సొంతమవుతుంది.

Also Read : Fish Egg Benefits : చేప గుడ్ల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News