Restaurant Style Chilli Paneer Recipe in Telugu: పనీర్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అందుకే చాలా మంది వీక్‌లో ఒక్కసారైనా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువగా రెస్టారెంట్లలో తయారు చేసే చిల్లీ పనీర్‌ను తీసుకుంటూ ఉంటున్నారు. ఇలా క్రమం తప్పకుండా రెస్టారెంట్లలో చేసిన వాటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. అయితే దీనిని రెడీ చేసుకోవడం కొంత కష్టతరమైన్నప్పటీకీ.. మేము అందించే పద్దతిలో తయారు చేస్తే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పనీర్ రెసిపీ పొందవచ్చు. అయితే ఈ చిల్లీ పనీర్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో..దీని కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
✾ పనీర్ - 250 గ్రాములు
✾ ఉల్లిపాయ - 1 (ముక్కలు)
✾ క్యాప్సికం - 1 (ముక్కలు)
✾ టమాటాలు - ఒక కప్పు మిశ్రమం
✾ అల్లం - ఒక ఇంచు
✾ వెల్లులి - 4 రెబ్బలు (సన్నని తురుము)
✾ పచ్చి మిర్చి - 2 (సన్నని తురుము)
✾ కొత్తిమీర తునకలు - కొంచెం
✾ సోయ సాస్ - 2 టేబుల్ స్పూన్లు
✾ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
✾ కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
✾ నూనె - తగినంత
✾ ఉప్పు - రుచికి తగినంత
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తయారీ విధానం:
✾ ముందుగా పనీర్ ముక్కలను కొంచెం ఉప్పు, కారం కలిపి మరీనేట్ చేయండి.
✾ ఇలా మరీనేట్ చేసిన పనీర్ ముక్కలను 15 నిమిషాలు నానబెట్టండి.
✾ పెద్ద కళాయిలో నూనె వేడి చేసి, అందులో పనీర్ ముక్కలను బంగారు రంగు వచ్చేలా వేయించాల్సి ఉంటుంది.
✾ ఇలా వేయించిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి.
✾ అదే నూనెలో ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేసి వేయించండి. కొంచెం ఉప్పు, కారం చల్లుకోని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✾ అలాగే అదే నూనెలో అల్లం, వెల్లు, పచ్చిమిర్చి వేసి వేయించండి. రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✾ పై పదార్థాలన్నీంటిని బాగా మిక్సీ పట్టుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత మరో కళాయి పెట్టుకుని అందులో నూనెను వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోండి.
✾ అందులోనే సోయ సాస్, వెనిగర్, కార్న్‌ఫ్లోర్ కలిపాల్సి ఉంటుంది.
✾ ఆ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాల్సి ఉంటుంది. ఇలా దగ్గర పడ్డాకా వేయించిన పన్నీర్ వేసుకోవాలి.
✾ ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుని..వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter