విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్న అక్కినేని సమంత ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించేందుకు సిద్ధమౌతోంది. 70 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్ గా వస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి టైటిల్ ఇంకా ఖారారు కాలేదు. సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి డైరెక్షన్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం. నందిరెడ్డి, సమంత కాంబినేషన్ లో తెరపైకి వస్తున్న ఈ మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం.
కెరియర్ తొలినాళ్లలో తన తొలి ఇన్నింగ్ లో గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చన సమంత.. పెళ్లి తర్వాత రెండో ఇన్నింగ్ లో విభిన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అలా సమంత చేసిన పాత్రలు ఆమెకి మరింత పేరును తెచ్చిపెట్టాయి కూడా...ఇదిలా ఉండగా తాజాగా ప్రాజెక్టు.. సమంత కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.