టాలీవుడ్ టాక్: రీమేక్ క్వీన్ గా సమంత !!

                                                

Last Updated : Mar 19, 2019, 03:52 PM IST
టాలీవుడ్ టాక్: రీమేక్ క్వీన్ గా సమంత !!

సినీ ఇండ్రస్ట్రిలో అడుపెట్టినప్పటి నుంచి సమంత కు రీమేక్ అంటే ఏంటో తెలియదన్నట్లు వ్యవహించింది. ప్రతిపాత్రలో ఢిఫరెంట్ లుక్ లో ప్రయోగాత్మకంగా కనిపించింది. సమంత తన తొమ్మిదేళ్ళ సినీ కెరీర్ లో తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది కానీ… ఎక్కడా రీమేక్స్ కి ప్రాదాన్యం ఇవ్వలేదు..  

సెకండ్ ఇన్నింగ్ లో సీన్  రివర్స్

చైతూతో పెళైన తర్వాత సీన్ మారిపోయింది. తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. తన సెకండ్ ఇన్నింగ్ లో వరుసగా రీమేక్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది.

సమంత రీమేక్ జాబితా ఇదే

సమంత రీమేక్ జాబితాను ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇటివలే కన్నడ ‘యూ టర్న్’ ను తెలుగు, తమిళ్ లో రీమేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నందినీ రెడ్డి డైరెక్షన్ లో ‘ఓ బేబీ’ సినిమా చేస్తోంది. ఇది కొరియన్ సినిమాకు రీమేక్.

ఈ రెండే కాదు లేటెస్ట్ గా తెలుగులో మరో రీమేక్ కి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సామ్. తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకున్న ’96’ నటించనుంది. ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్ ప్లే చేయబోతుంది.. ఈ సినిమాతో సామ్ రీమేక్ లిస్టు పెరగనుంది.   సమంత రీమేక్ క్వీన్ గా మారిందని తెలుగు ఇండస్ట్రిలో టాక్ వినిపిస్తోంది.

Trending News