2024 Ugadi Wishes: ఉగాది శుభాకాంక్షలు 2024, ప్రత్యేకమైన కోట్స్, వాట్సాప్ విషెష్..

Ugadi 2024 Telugu Wishes: ఉగాది పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ పండగ రోజే సృష్టిని కూడా నిర్మించారని పూర్వీకులు చెప్పుకుంటారు. అందుకే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున మీకు ఇష్టమైన వారందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2024, 09:36 PM IST
2024 Ugadi Wishes: ఉగాది శుభాకాంక్షలు 2024, ప్రత్యేకమైన కోట్స్, వాట్సాప్ విషెష్..

Ugadi 2024 Telugu Wishes: పురాణాల ప్రకారం శుక్ల పాండ్యమి రోజునే సృష్టిని నిర్మించారని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈరోజు నుంచే చాలామంది రైతులు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ సృష్టి నిర్మాణానికి గుర్తింపు గానే ఉగాది పండుగను జరుపుకుంటారనే టాక్ కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఈ పండగను కొత్త సంవత్సరంగా భావిస్తారు. అందుకే ఈరోజు పంచాంగ శ్రవణం, గోపూజ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందుకే ఉగాది పండగకి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త కాంతులు వెలగాలని కోరుకుంటూ.. మీకు ఇష్టమైన ప్రతి ఒక్కరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.

క్రోధినామ సంవత్సర ఉగాది ప్రత్యేకమైన టాప్ 10 కోట్స్:

ప్రతి క్షణం కొత్త అవకాశం, ప్రతి అడుగు ఒక కొత్త ప్రయాణం.. ఈ క్రోధినామ సంవత్సరంలో మీ జీవితం శుభం కావాలి.

క్రోధం శక్తిని సూచిస్తుంది. ఈ సంవత్సరం మీలోని శక్తిని మంచి కోసం ఉపయోగించి మీ లక్ష్యాలను చేరుకోండి.

క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాలి. భయాలను వదిలేసి, ధైర్యంగా ముందుకు సాగండి.

ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వారే.. ఈ సంవత్సరం మీలోని ప్రత్యేకతను గుర్తించి, ప్రపంచానికి చాటిచెప్పండి.

కష్టాలు జీవితంలో ఒక భాగం.. ఈ సంవత్సరం మీ కష్టాలను అధిగమించి, విజయం సాధించండి.

ప్రేమ, కరుణ, సహనం ఈ మూడే జీవితానికి పునాది. ఈ సంవత్సరం ఈ మూడు గుణాలను పెంపొందించుకోండి.

కృతజ్ఞతతో జీవించడం ఒక ఆనందం. ఈ సంవత్సరం మీరు కృతజ్ఞతతో ఉండి మరింత సంతోషంగా జీవించండి.

ప్రకృతితో సహజీవనం మన బాధ్యత. ఈ సంవత్సరం ప్రకృతిని కాపాడటానికి మీ వంతు కృషి చేయండి.

విద్యే ధనం సర్వత్ర ప్రధానం. ఈ సంవత్సరం పది మంది పేద పిల్లలకు విద్య అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి.

"కొత్త ఆశలకు, కలలకు, విజయాలకు నాంది పలికే క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"

"భూమి పుష్పించాలి, భావనలు పులకించాలి, ప్రతి మనసు హాయిగా ఉండాలి. ఇదే మా ఉగాది శుభాకాంక్షలు."

"ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి పాఠం ఒక అనుభవం. ఈ ఉగాది మీకు మంచి అనుభవాలకు నిండాలి."

"క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో కొత్త ఒరవడికి నాంది పలకాలి..ఉగాది శుభాకాంక్షలు."

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News