Breathing Exercises: ఆధునిక జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన కారణంగా పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని రకాల వ్యాయామ పద్ధతులతో ఏ విధమైన మందుల్లేకుండానే ఈ సమస్యల్నించి బయటపడవచ్చు..
వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగులతో బిజీగా ఉండటం వంటి కారణాలతో అనేక అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటుంటారు. సామర్ధ్యానికి మించి పనిచేయాలని ఆలోచించడం లేదా ఇతర కారణాలతో ఒత్తిడి, ఆందోళనకు లోనవుతుంటారు. కొంతమంది ఆర్ధికంగా ఎంతగా పటిష్టంగా ఉన్నా..ఆందోళనగానే ఉంటారు. మరి కొంతమంది ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆందోళన చెందుతుంటారు. ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండగలం. కానీ అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఈ రెండూ తప్పడం లేదు. ఈ క్రమంలో కొన్ని సులభమైన వ్యాయామ పద్దతులు ఆచరిస్తే..జీవితంలో ఒత్తిడి, ఆందోళన రెండింటినీ జయించవచ్చు.
రోజూ తప్పకుండా చేయాల్సిన వ్యాయామ పద్ధతులు
కాళ్లు మడిచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉంచి..రెండు చేతుల్ని మోకాళ్లకు ఆన్చాలి. కళ్లు మూసుకుని ధ్యానముద్రలో ఉండాలి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా వదలడం చేయాలి. ఇలా రోజుకు కనీసం 10 సార్లు..3 టైమ్స్ చేయాలి.
కాళ్లను మడిచి, వీపు నిటారుగా ఉంచి కూర్చోవాలి. నోరు తెరవకుండా ముక్కుతో శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకున్న తరువాత నోరు తెరిచి..గుండ్రంగా పెట్టి పెదాలతో నెమ్మది నెమ్మదిగా వదలాలి. ఇలా 3-4 సార్లు రిపీట్ చేయాలి.
ఈ ఆసనంలో కూడా కాళ్లు మడిచి..వీపు నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడి బొటనవేలుతో ముక్కు కుడి నాసికను పట్టుకుని ఎడమవైపుతో శ్వాస పీల్చడం వదలడం, తరువాత ఎడమ నాసికను క్లోజ్ చేసి..కుడి నాసికతో శ్వాస పీల్చడం వదలడం చేయాలి. రోజూ క్రమం తప్పకుండా కాస్సేపు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఈ పద్ధతులు పాటిస్తే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Hibiscus Tea: మందార టీ తాగితే.. గుండె సమస్యలు దూరమవుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook