Morri Pandlu: సమ్మర్ లో ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు.. రుచితో పాటు పుష్కలమైన పోషకాలు..

Morri Pandlu: మోర్రిపండ్లు ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో ఎక్కువగా కన్పిస్తాయి. ఇవి చాలా అరుదుగా మాత్రమే కన్పిస్తాయి. కానీ వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయని  నిపుణులు చెబుతుంటారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2024, 01:37 PM IST
  • మోర్రీ పండ్లను డైలీతినాలంటున్న నిపుణులు..
  • జీర్ణక్రియలు సమస్యలుంటే వెంటన్ చెక్..
Morri Pandlu: సమ్మర్ లో ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు.. రుచితో పాటు పుష్కలమైన పోషకాలు..

Health Benefits With Morri pandlu: సాధారణంగా కొన్ని ఫలాలు కొన్ని సీజన్ లలో మాత్రమే మనకు లభిస్తాయి. అందుకే మన పెద్దవాళ్లు ఏ సీజన్ లో ఏ పండ్లు దొరుకుతాయో... వాటిని అస్సలు వదలోద్దని చెబుతుంటారు. వీటిని తింటే మన శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ కాలంలో ముఖ్యంగా మామిడిపండ్లు ఎక్కువగా వస్తుంటాయి. మామిడినిని ఆవకాయ, పండ్లు, రసాలుగా తింటు ఉంటారు. అంతేకాకుండా.. కొందరు మామిడితో పప్పు, చట్నీలు కూడా చేసుకుంటారు. ఇక దీనితో పాటుగా.. మోర్రిపండ్లు కూడా ఎంతో ఫెమస్. ఇది కూడా ఎండకాలంలోనే మార్కెట్ లోకి వస్తుంటాయి. మోర్రి పండ్లలో పుష్కలమైన ఆరోగ్యలాభాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. మోర్రీ పండ్ల చూడటానికి నల్లగా ఉంటాయి.

Read More: Ugadi 2024-2025: ఉగాది రోజు దేవుడి గది శుభ్రం చేస్తున్నారా..?.. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయోద్దు..

ఇవి కాయలుగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లోను, పండిన తర్వాత మాత్రం నల్లగా ఉంటాయి. వీటి స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉగాది, శ్రీరామనవమి ఆకాలంలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. అడవి ప్రాంతంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. పల్లెటూర్లలో వీటిని గుల్లలలో తీసుకొచ్చి, అమ్ముతుంటారు. ఇవి రుచికి ఎంతో తియ్యగా ఉంటాయి. మోర్రిపండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇవి డ్రైఫ్రూట్స్ తో సమానంగా మనశరీరానికి ప్రయోజనాలు కల్గిస్తాయి.

ఇవి తినడం వల్ల , మనశరీరానికి విటమిన్నలు, మినరల్స్ లభిస్తాయి. మోర్రిపండ్ల శాస్త్రియనామం బుంచనానీయా లాటిఫొలియా. దీన్ని చిరోంజి పండు అని కూడా పిలుస్తుంటారు.  ఇది మన శరీరంలోని ఇమ్యునిటీని పెంచుతుంది. చర్మం హెల్తీగా ఉండటంలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోను, బెల్లీఫ్యాట్ ను తగ్గించడంలోను ఉపయోగపడుతుంది. మౌత్ అల్సర్ లను తగ్గిస్తుంది. శరీంలో కొందరు అధిక వేడితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఉపశమనం కల్గిస్తుంది.

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..

 శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తెల్లని వెంట్రులకను నల్లగా మారేలా చేస్తుంది. ఉదర సంబంధం వ్యాధులను దూరం చేస్తుంది. శరీంలో నుంచి చెడు పదార్థాలను బైటకు విసర్జితమయ్యేలా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అందుకే చాలా మంది సమ్మర్ లో దీన్ని అస్సలు తినకుండా వదలోద్దు. దీని జ్యూస్ కూడా తాగితే మనశరీరానికి పుష్కలమైన మినరల్స్, విటమిన్లు లభిస్తాయి. ఇదర పండ్ల మాదిరిగా మోర్రి పండ్లు అన్ని కాలాల్లోకూడా లభించవు. ఇవి కేవలం ఎండాకాలంలో అది కూడా కొన్ని నెలలు మాత్రమే లభిస్తాయి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News